ఆరు కాళ్లతో క్రికెట్ దిగ్గజం దీనస్థితి

jayasuriya suffering from knee problem
Tellmeboss.net

సనత్ జయసూర్య.. శ్రీలంక జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా ఎన్నో రికార్డులు సృష్టించిన గొప్ప క్రికెటర్. తన బ్యాటుతో ఎందరో బౌలర్లకి చుక్కలు చూపించిన ఇతను.. తన బౌలింగ్ ప్రతిభతో బ్యాట్స్‌మెన్‌ల ఊచకోత కూడా కోశాడు. అసలు ఈయన గ్రౌండ్‌లోకి వస్తున్నాడంటే.. ప్రత్యర్థి జట్టు గుండెల్లో రైళ్లు పరగెత్తేంత భయం!

అలాంటి వ్యక్తి ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కనీసం నడవలేని దీన స్థితిలో ఉన్నాడు. గతకొంతకాలం నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్న జయసూర్య.. ఇప్పుడు స్ట్రెచర్స్ లేనిదే అడుగులు వేయలేడు. ఇప్పటికే మెల్‌బోర్న్‌లో మోకాలికి ఆపరేషన్‌ జయసూర్య.. త్వరలోనే చికిత్స నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. ఈ శస్త్రచికిత్స అనంతరం జయసూర్య కోలుకోవడానికి కనీసం నెలరోజుల సమయం పడుతుంది. అప్పటివరకు ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు.

Tellmeboss.net

ఇదిలావుండగా.. సక్సెస్‌ఫుల్ ఆటగాడిన పేరొందిన జయసూర్య టెస్టుల్లో 6973 పరుగులు, 98 వికెట్లతోనూ.. వన్డేల్లో 13430 పరుగులు, 323 వికెట్లతో ఆల్‌ రౌండ్‌ ప్రదర్శన కనబర్చాడు. టీ20ల్లో అతను 629 పరుగులు చేసి 19 వికెట్లు తీసుకున్నాడు. 1996లో శ్రీలంక వరల్డ్‌ కప్‌ గెలవడంతో జయసూర్య కీలక పాత్ర వహించాడు. శ్రీలంక క్రికెట్ బోర్డుకు రెండుసార్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగిన ఆయన.. గతేడాది ఆ పదవికి గుడ్‌బై చెప్పేశాడు.

Tellmeboss.net
Related posts:
రోజాపై వేటు దిశగా.. అనిత కన్నీరు..
యూట్యూబ్‌లో యువతి ‘బాత్‌రూం’ వీడియో సంచలనం (వీడియో)
ధోని స్టంప్స్ తీసుకెళ్ళడం వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ.. తెలిస్తే అతని ఫ్యానైపోతారు!
ఊపిరి పెయింటింగ్‌పై సుమ సెటైర్.. మరి నాగ్ కోరిక తీరుస్తారా?
ఛాన్స్ కావాలా..? అయితే బెడ్‌రూమ్‌లోకి రా!
మరో బాంబ్ పేల్చిన విశాల్.. చుక్కలు చూపిస్తున్నాడుగా!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.