ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సంఘమిత్ర!

త‌మిళ ద‌ర్శకుడు సుందర్ సి డైరెక్షన్‌లో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్టుతో రూపొందుతున్న చిత్రం ‘సంఘమిత్ర’. ఈ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు సంవత్సరం అయ్యింది. కానీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ను ఎట్టకేలకు డేట్ ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించుకుని ఆగష్టు నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడఅ అవుతున్నారు చిత్ర యూనిట్. భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కనీవినీ ఎరుగని గ్రాఫిక్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ సోషియో ఫాంటసీగా తెరకెక్కించనున్నాడు దర్శకుడు సుందర్ సి.

ఈ సినిమాలో ముందుగా శృతి హాసన్‌ను అనుకున్నా ఆ తరువాత బాలీవుడ్ బ్యూటీ దిషా పటానీ నటిస్తోంది. ఇక తమిళ హీరోలు జయం రవి, ఆర్య నటిస్తున్నారు. హేమ రుక్ముని నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ ఎ. ఆర్. రెహమాన్ అందించనున్నారు. 2019లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.