క‌మల్‌పై మండిప‌డుతున్న టాప్‌ హీరో!!

ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా అభ్య‌ర్థుల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న స్నేహితులుగా ఉన్న వారు కూడా ఆ స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థులుగా మారిపోతారు. మాట‌ల దాడులు చేసుకుంటారు. అయితే ఇది సినీ ఇండస్ట్రీకి కూడా వర్తిస్తుంది. ఆప‌ద స‌మ‌యంలో ఆదుకోవడానికి క‌లిసిక‌ట్టుగా ఉంటారు. సిని`మా` ఎన్నిక‌లు జ‌రిగిన‌పుడు ఏ స్థాయిలో వివాదాలు చెల‌రేగాయో చూశాం. ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీ వంతు వ‌చ్చింది. అక్క‌డ త్వ‌ర‌లో న‌డిగ‌ర్ సంఘానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న ఒక అగ్ర‌న‌టుడు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌ని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నాడు.

మొన్న జరిగిన తెలుగు సినిమా ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జ‌య‌సుధ పోటీ ప‌డ్డారు. ఇద్ద‌రికీ రెండు బ‌ల‌మైన వ‌ర్గాలు అండ‌గా నిలిచాయి. దీంతో `మా` ఎన్నిక‌లకు ప్ర‌చారం అసెంబ్లీ ఎన్నిక‌ల స్థాయిలో జ‌రిగింది. ఒక‌రినొక‌రు ఘాటు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. వీరికితోడు త‌మ ప్యానెల్‌కు అనుకూలంగా ఓట్లు రాబ‌ట్టుకునేందుకు ఎన్నో యుక్తులు ప‌న్నారు. అయితే చివ‌ర‌కు ప్ర‌శాంతంగా ముగిశాయి. ఇప్పుడు త‌మిళనాట కూడా ఇటువంటి చిత్ర‌మే మ‌ళ్లీ క‌నిపిస్తోంది. అక్క‌డ న‌టుల సంఘానికి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌, హీరో విశాల్ ప్యానెళ్లు పోటీప‌డుతున్నాయి.

ఇందులో విశాల్ ప్యానెలే గెలిచే అవ‌కాశాలున్నాయని స‌ర్వేలు చెబుతున్నాయ‌ట‌. దీని వెన‌కాల క‌మ‌ల్ హాసన్ ఉన్నాడ‌ని శ‌ర‌త్‌కుమార్‌కు అనుమానం క‌లిగింద‌ట‌. అందుకే క‌మ‌ల్‌ను చాలా ఘాటుగా విమ‌ర్శించాడు. క‌మ‌ల్ విశ్వ‌రూపం సినిమా క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు, వాటి నుంచి క‌మ‌ల్‌ను బ‌య‌ట‌ప‌డేసేందుకు తాను చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని, ఆ సినిమాకు ఆర్థికంగా కూడా త‌న భార్య రాధిక చాలా సాయం చేసింద‌ని వాట‌న్నింటినీ మ‌రిచిపోయిన కృత‌ఘ్నుడు క‌మ‌ల్ అని తీవ్ర స్వ‌రంతో ఆరోపిస్తున్నాడు.

క‌మ‌ల్ లాంటి ఓ స్టార్ హీరోను మ‌రో స్టార్ మరో స్టార్ హీరో శ‌ర‌త్‌కుమార్ ఇలా ఘాటుగా విమ‌ర్శించ‌డం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై క‌మ‌ల్ ఎలా రిప్లై ఇస్తాడో చూడాలి.

Related posts:
అసెంబ్లీలో జరిగిన ‘బూతు పురాణం’ ఇదే!
కొడుకు స్కూల్ అడ్మిషన్ దొరకలేదని తండ్రి ఏం చేశాడో తెలుసా..? (వీడియో)
నభూతో అనిపెంచే శతాబ్దాల మొహెంజదారో ఫస్ట్‌లుక్ (వీడియో)
‘పెళ్లిచూపులు’ హీరోకి బ్లాక్‌బస్టర్ ఆఫర్.. వారి కోవలోకి ఎంట్రీ?
నానితో మూ(డు)డింది అంటున్న దిల్ రాజు!
షాకింగ్: ఇంటర్నేషనల్ అవార్డుకు హలో చెప్పిన అఖిల్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.