సత్యం రాజేష్‌కి ‘క్షణం’లో ఆ అవకాశం ఎలా వచ్చిందంటే..

Satyam Rajesh Kshanam Chowdary Police Role

Satyam Rajesh Kshanam Chowdary Police Role Secret

ఫిబ్రవరి 26వ తేదీన విడుదలైన ‘క్షణం’ సినిమా ఎవరూ ఊహించని రేంజులో భారీ విజయం సాధించింది. విడుదలకు ముందే పోస్టర్స్, టీజర్, ట్రైలర్లతో ఉత్కంఠ రేపుతూ వచ్చిన ఈ చిత్రం.. రిలీజైన తర్వాత అంచనాలకు తగ్గట్టుగానే హిట్టయ్యింది. అంతేకాదు.. తొలి మూడురోజుల్లోనే మొత్తం పెట్టుబడిని కలెక్షన్ల రూపంలో రాబట్టి.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది. ఇక ఇందులో ప్రతి పాత్రకు తనకంటూ ప్రాముఖ్యత వుండడంతో.. అందులో నటించిన వారందరికీ ప్రశంసలు దక్కుతున్నాయి. అలాంటివాళ్ళలో సత్యం రాజేష్ ఒకడు.

ఈ సినిమాలో చౌదరి అనే పోలీస్ పాత్రలో నటించిన రాజేష్‌కి సినీ ప్రముఖుల నుంచి పొగడ్తల వర్షం కురుస్తూనే వుంది. గతంలో మునుపెన్నడూలేని విధంగా ఇంతటి భారీ క్యారెక్టర్‌లో నటించి ఆశ్చర్యపరిచాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ‘క్షణం’ అతని కెరీర్‌ని మలుపు తిప్పేసింది. దీంతో.. అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన ఆనందాన్ని విలేకరులతో పంచుకుంటూ.. ‘‘ఇప్పటివరకు నేను 350 సినిమాల్లో నటించాను. నేనెప్పుడూ ఇలాంటి పాత్రలో నటిస్తానని అనుకోలేదు. ఇలాంటి క్యారెక్టర్‌లో నేను నటిస్తానని ఎవ్వరూ ఊహించి వుండరు కూడా. కానీ ‘క్షణం’ సినిమా ఆ అభిప్రాయాన్ని మార్చింది. నేను కూడా ఇలాంటి పాత్రలో నటించగలనని నమ్మకం కలిగించింది’’ అని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.

‘క్షణం సినిమా కోసం డెరైక్టర్ నన్ను కలిసినప్పుడు హీరోకి స్నేహితుడి అయి వుంటుందనుకున్నాను. కానీ.. ఆయన పోలీస్ క్యారెక్టర్ చేయమని చెప్పేసరికి షాక్ అయ్యాను. నిజానికి.. ఈ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సంపత్‌రాజ్ నటించాల్సి వుండేది. అయితే.. ఇంతలో ఏమైందో తెలీదు కానీ చివరి క్షణంలో నన్ను తీసుకున్నారు. అలా ఆ విధంగా ఈ క్యారెక్టర్ నాకు దక్కింది. ఇక ఈ చిత్రం రిలీజైనప్పటి నుంచి నాకు ప్రశంసలు దక్కడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. నేనిలాంటి పాత్రలో చేయడమేంటని ఆశ్చర్యపోతూ చాలామంది సన్నిహితులు ఫోన్లు చేస్తున్నారు’’ అని రాజేష్ చెప్పుకొచ్చాడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.