ఎన్టీఆర్ మూవీపై ‘సీనియర్’ మిస్టరీ.. ఈసారి ఎవరో?

త్రివిక్రమ్ శ్రీనివాస్ ట్రాక్ రికార్డ్ ఒక్కసారి తిరగేస్తే.. ఆయన తీసిన చిత్రాల్లో ఒక బలమైన పాత్ర ఖచ్చితంగా వుంటుంది. అఫ్‌కోర్స్ ప్రతిఒక్కరి మూవీల్లోనూ ఉండటం కామన్ కానీ.. త్రివిక్రమ్ మూవీల్లో ఆ పాత్రలు మరింత బలంగా వుంటాయి. ‘అత్తారింటికి దారేది’, ‘అఆ’ చిత్రాల్లో నదియా పోషించిన ‘అత్త’ పాత్ర.. అలాగే ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బూ పోషించిన తల్లి పాత్ర ఆ సినిమాలకే కీలకంగా నిలిచాయి. లేటెస్ట్‌గా ఎన్టీఆర్‌తో చేయనున్న మూవీలోనూ త్రివిక్రమ్ అలాంటి ఓ కీ-రోల్ డిజైన్ చేశాడని తెలిసింది. దీంతో.. ఈ పాత్రని ఎవరు పోషిస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈరోజుల్లో ప్రేక్షకులు ప్రతి మూవీలోనూ కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి నదియా, ఖుష్బూలను ఖచ్చితంగా రిపీట్ చేయకపోవచ్చని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇంకెవరిని ఎంపిక చేస్తారా? అని ఆరాతీస్తే.. రమ్యకృష్ణ, మీనా, సిమ్రన్, లయ, ఊహ వంటి గత తరం టాప్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళలో త్రివిక్రమ్ ఎవరినీ ఎంపిక చేస్తాడా అన్నదే మిస్టరీగా మారింది. ఏ ఒక్కరూ ఎంపికైనా.. ఖచ్చితంగా వాళ్ళు తిరిగి మళ్ళీ లైమ్‌లైట్‌లోకి రావడం ఖాయం. నదియా, ఖుష్బూలు కూడా ఆయన సినిమాల ద్వారానే దెబ్బకు క్రేజ్ సంపాదించారు. మరి ఈసారి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దొరుకుతుందో చూడాలి.

కాగా.. మార్చిలో సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో హీరోయిన్లుగా పూజా హెగ్డే, శ్రద్ధ కపూర్‌లను పరిశీలిస్తున్నట్లు టాక్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ సరికొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.