ఊహించని ట్విస్ట్ : శ్రీదేవి డెత్‌పై మిస్టీరియస్ రిపోర్ట్

అతిలోక సుందరి శ్రీదేవి మృతి చెంది దాదాపు మూడు నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఆమె మరణంపై అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. అసలు బాత్ టబ్‌లో మునిగి చనిపోవడం ఎలా సాధ్యమవుతుందని దుబాయ్ ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చిన నివేదికని సైతం ఇంకా చాలామంది తప్పు పడుతూనే ఉన్నారు. శ్రీదేవిది నిజంగానే సహజ మరణం కాదని.. దీని వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

సరిగ్గా ఇదే అనుమానాన్ని ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి వ్యక్తపరిచారు. అంతేకాదు.. తనదైన ఇన్వెస్టిగేటివ్ మెదడుతో ఆమె మృతిపై ఒక మిస్టీరియస్ రిపోర్ట్ కూడా చెప్పుకొచ్చారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి చనిపోలేదని చెప్పిన ఆయన.. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆమెను హత్య చేశారని బల్లగుద్ది మరీ చెప్పారు. బాత్ టబ్‌లో ఒకరిని బలవంతంగా ముంచి చంపడం చాలా సులువని.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ హత్యను సహజమరణంగా చిత్రీకరించడం మరింత సులువని.. శ్రీదేవిని కూడా అలాగే చంపేసి, దీన్నో సహజమరణంగా చిత్రీకరిస్తున్నట్లు తాను అనుమనిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. శ్రీదేవి మృతిపై దుబాయ్ ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదికలో చాలా అనుమానాలున్నాయని చెప్పుకొచ్చారు.

శ్రీదేవి మృతిపై లోతుగా విచారించేందుకు తాను దుబాయ్‌లో శ్రీదేవి బస చేసిన హోటల్‌కి వెళ్ళానని.. అయితే ఆమె ఉన్న గదిలో దిగేందుకు అనుమతి లభించకపోవడంతో పక్కనే ఉన్న మరో గదిలో బస చేశానని.. అక్కడ బాత్ టచ్ సీన్ రీక్రియేట్ చేశానని అన్నారు. లాజికల్‌గా చూస్తే.. ఆ రూమ్‌లో బాత్ టబ్‌లో పడి చనిపోవడం సాధ్యమే కాదని తేల్చి చెప్పారు. శ్రీదేవి మరణం వెనుక ఏదో తెలియని మిస్టరీ ఉందని వెల్లడించారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.