ట్విస్ట్ ఇచ్చిన ‘సాహో’.. పైన పటారం లోన లొటారం!

‘బాహుబలి’లాంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత రెబెల్‌స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ‘సాహో’ కోసం యావత్ దేశ ప్రజలు తెగ వెయిట్ చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వ్యాల్యూస్‌తో బారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతుండడంతో తారాస్థాయి అంచనాలూ నెలకొన్నాయి. అందుకే.. ఈ సినిమా గురించి ఏదైనా ఆసక్తికర వార్త వస్తుందేమోనని సినీ లవర్స్ తెగ ఆరాటపడుతున్నారు.

ఇంతవరకు బాగానే వుంది కానీ.. యూనిట్ నుంచి మాత్రం అలాంటి సమాచారాలైతే పెద్దగా రావడం లేదు. ఏదో అప్పుడప్పుడు కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ అవుతున్నాయే తప్పితే.. రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. దీంతో.. ఈ సినిమా డెవలప్‌మెంట్ సంగుతులు ఏంటా? అని లోతుగా ఆరాతీస్తే.. ఫ్యూజులు ఎగిరిపోయే వార్తొకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ప్రభాస్, సినిమాటోగ్రఫర్ ఆర్.మధి ఇద్దరూ ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారని తెలిసింది. నిజానికి.. సినిమా మేకింగ్ బాధ్యతలన్నీ దర్శకుడే చూసుకోవాలి. కానీ.. ఇక్కడ అతనికంటే ఈ ఇద్దరి ఇన్వాల్స్‌మెంటే ఎక్కువగా వుందని ఇన్‌సైడ్ టాక్. అయితే.. వాళ్ళు అలా జోక్యం చేసుకోవడం వెనుక ఒక బలమైన కారణం కూడా వుంది.

ఈ చిత్రం దర్శకుడు సుజీత్‌కి పెద్దగా ఎక్స్‌పీరియన్స్ లేదు. అతను కేవలం ‘రన్ రాజా రన్’ చిత్రం మాత్రమే తీశాడు. అలాంటి అతనికి ‘సాహో’ వంటి పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చాలా కష్టంగా మారింది. ఇది గమనించిన ప్రభాస్, మధి.. అతనిపై ఒత్తిడి తగ్గించేందుకు అంతా తామై చూసుకుంటున్నారు. ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త వహించారు కానీ.. చివరికి ఇది లీకైపోయింది.

Related posts:
నో ప్రీమియ‌ర్ .. డైరెక్ట్ ఎటాక్ : ద‌టీజ్ బాహుబ‌లి
‘కబాలి’ రిలీజ్‌ని ఆపేయాలని నిర్మాతకి గట్టిగా చెప్పిన రజనీకాంత్
ఎన్టీఆర్‌తో రాజమౌళి ‘మహాభారతం’.. ‘బాహుబలి’ తర్వాతే!
లీకైన ‘జై లవ కుశ’ స్టోరీలైన్.. తారక్ నటవిశ్వరూపం
‘26’తో ట్విస్ట్ ఇచ్చిన త్రివిక్రమ్.. తారక్ ఫ్యాన్స్‌కి పూనకాలే!
తారక్‘మంత్రం’.. బన్నీకి పూర్తి రివర్స్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.