వెంకీతో ‘‘ఆటా నాదే వేటా నాదే’’ అంటున్న బ్యూటీ!

డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో విక్టరీ వెంకటేష్ గతకొంత కాలంగా చాలా సెలెక్టివ్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. చివరిగా గురు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకీ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇటీవల ‘‘నేనే రాజు నేనే మంత్రి’’ చిత్రంతో సక్సెస్ కొట్టిన దర్శకుడు తేజ డైరెక్షన్‌లో వెంకీ ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అదితిరావు హైదరీ హీరోయిన్‌గా చేయనుందనే విషయం ఇప్పటికే అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. అయితే డేట్స్ ఇష్యూ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ నుండి అమ్మడు వాకౌట్ చేసింది. ఈ దెబ్బతో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా మరోసారి మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతోంది అందాల భామ శ్రియా. వీరిద్దరూ కలిసి చేసిన లాస్ట్ మూవీ గోపాల గోపాల బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక ఈ సినిమాకు ‘‘ఆటా నాదే వేటా నాదే’’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారు చిత్ర యూనిట్.

తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాను అతి త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.

Related posts:
బెల్లంకొండ శ్రీనివాస్, భీమినేని ‘స్పీడున్నోడు’ మూవీ రివ్యూ, రేటింగ్ & విశ్లేషణ
బాలీవుడ్‌కు షాకిచ్చిన మహేష్.. ఆ ఆరుగురిలో ‘ఒక్కడు’!
మరో మైలురాయితో అరుదైన ఘనత సాధించిన ‘బిచ్చగాడు’
‘బాహుబలి’ని విమర్శించిన స్టార్ డైరెక్టర్.. అదో చెత్త సినిమా అట!
‘ప్రేమమ్’ 24 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్
31వ రోజు చరిత్ర సృష్టించిన ‘రంగస్థలం’

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.