‘‘ఆ నిర్మాత 5మందితో’’.. హీరోయిన్ బయటపెట్టిన చీకటి కోణం

ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పటికే ఎందరో భామలు మీడియా ముందుకొచ్చి పచ్చినిజాల్ని బయటపెట్టారు. దర్శకనిర్మాతల నుంచి తరచూ లైంగిక దాడులు ఎదురవుతుంటాయని.. అసలు హీరోయిన్లకు పరిశ్రమలో ఏమాత్రం ప్రాధాన్యం ఉండదని తమ ఆవేదనని బహిర్గతం చేశారు. తాజాగా మరో ఇద్దరూ భామలైన శృతి హరిచరన్‌, ప్రణితలు మరిన్ని చీకటి కోణాల్ని రివీల్ చేశారు. హైదరాబాద్‌లోని పార్క్‌ హాయత్‌ హోటల్‌లో గురువారం నిర్వహించిన ‘‘ఇండియా టుడే సౌత్‌ కన్‌క్లెవ్‌-2018’’లో భాగంగా ‘సెక్సిజం ఇన్‌ సినిమా’ అంశంలో జరిగిన చర్చల్లో భాగంగా సినీ ఫీల్డ్‌లో హీరోయిన్ల పరిస్థితి ఎలా వుందో తెలిపారు.

తొలుత ప్రణీత మాట్లాడుతూ.. ‘‘నిజానికి హీరోయిన్ అంటే ప్రతిఒక్కరూ గొప్ప అనుకుంటారు కాని పరిశ్రమలో అలా చూడరు. నిర్ణయాల్లో చివరి కేటగిరిలోనే హీరోయిన్‌ ఉంటుంది. ‘నేను ఒక మూవీలో నక్సలైట్‌ భార్యగా నటించాను. అందులో గదిలోకి పరిగెత్తే స్లోమోషన్‌ సీన్ షూట్ చేస్తున్నప్పుడు.. కెమెరా ఎటు వెళ్లిపోతోందో తెలియని పరిస్థితి నెలకొంది. షూట్ చేసిన తర్వాత ఆ సీన్ చూశాక నాకు సిగ్గేసింది.. చాలా బాధపడ్డాను’’ అని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎదుర్కొన్న మరో అనుభవం గురించి కూడా ప్రణీత తెలిపింది. ‘‘నేను గతంలో ఒక కన్నడ సనిమాలో నటిస్తున్న సమయంలో ఓ కొరియోగ్రాఫర్ చాలా దురుసుగా వ్యవహరించాడు. ‘నీకు చేత కాకపోతే వెళ్లిపో’ అని ఏమాత్రం మర్యాద లేకుండా నాపై విరుచుకుపడ్డాడు’’ అని చెప్పింది. ఇక మరో హీరోయిన్ శృతి హరిచరన్ కూడా ఇలాంటి అనుభవాల్నే ఎదుర్కొన్నట్లు పేర్కొంది.

ఒక తమిళ సినిమాలో నటిస్తున్న టైంలో ఓ నిర్మాత వచ్చి ‘‘మేం అయిదుగురు నిర్మాతలు ఉన్నాం.. మా ఇష్ట ప్రకారం నడుచుకోవాలని’’ చెప్పగా… అప్పుడు దానికి ‘‘నా దగ్గర ఎప్పుడూ చెప్పులు సిద్ధంగా ఉంటాయని గట్టిగా బదులిచ్చానని’’ చెప్పింది. దీంతో అప్పట్లో తనపై చాలా దుమారం రేగిందని, ఆ తర్వాత నుంచి తనకు సినిమాలు రావడం తగ్గిపోయాయని శృతి తెలిపింది. ‘‘అంతేకాదు.. ఎంత బాగా నటించామని పరిశీలించరు, హీరోయిన్‌‌ని కేవలం అందంగా చూపించాలనే ధ్యాసపైనే దృష్టి ఉంటుంది’’ అని ఆమె పేర్కొంది. చిత్రపరిశ్రమలో ఇలాంటి ఘటనలు, అవమానాలు జరుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.