2018లో ఆరు కొత్త పండుగలు.. ఫ్యాన్స్‌కి పూనకాలే!

Six New Festivals In 2018
Tellmeboss.net

2017లో టాలీవుడ్ ఓ రేంజులో దుమ్ముదులిపిన విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా.. ఫస్టాఫ్‌లో వచ్చిన సినిమాలన్నీ కలెక్షన్ల ప్రభంజనం సృష్టించి, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మునుపెన్నడూలేని రేంజులో ప్రాఫిట్స్ తెచ్చిపెట్టాయి. కానీ.. సెకండాఫ్‌లో మాత్రం ఆ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఒక్క ‘జై లవకుశ’ సినిమా తప్ప మరేదీ కలెక్షన్ల సునామీ సృష్టించలేదు. భారీ అంచనాలమీద వచ్చిన చాలా సినిమాలు ఘోరంగా ఫ్లాపై, కోట్లలో నష్టాలు మిగిల్చాయి. ఇక కొందరి హీరోల నుంచి అసలేం సినిమాలే రాలేదు. దీంతో.. ఆ ఫ్యాన్స్‌తోపాటు సినీ ప్రేక్షకులు సైతం కాస్త డిజప్పాయింట్‌కి గురయ్యారు. అయితే.. ఈ లోటుని తీర్చేందుకు వచ్చే ఏడాది మన స్టార్ హీరోలు మూకుమ్మడిదాడికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Tellmeboss.net

తొలుత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంతో 2018ని ప్రారంభించబోతున్నాడు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసిన సినిమా కావడంతో.. దీనిపై తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలో ఆల్రెడీ పాజిటివ్ టాక్ వస్తుండడంతో.. ‘సంక్రాంతి’తోపాటు ఫ్యాన్స్‌కి సక్సెస్ పండుగ కూడా ఉండబోతోందని నమ్మకంగా చెప్తున్నారు. దీని తర్వాత ‘రంగస్థలం’ రిలీజ్ కాబోతోంది. రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబోలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌పై రూపొందుతున్న ఈ సినిమాపైనా ఓ స్థాయిలో అంచనాలున్నాయి. ఈ ఏడాదిలో చరణ్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకపోవడంతో.. దీనిపై ఫ్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక వరుస డిజాస్టర్స్‌తో బాగా నిరాశపరిచిన మహేష్.. ‘శ్రీమంతుడు’లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తుండడంతో దీనికి మంచి క్రేజ్ ఉంది. ఈ జంట మరోసారి ‘శ్రీమంతుడు’ మ్యాజిక్ రిపీట్ చేయడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు.

వరుస విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న అల్లుఅర్జున్ ‘నా పేరు సూర్య’ కూడా 2018 ఏప్రిల్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. బన్నీ గట ట్రాక్ రికార్డ్ ఈ చిత్రాన్ని ఆల్రెడీ లిఫ్ట్ ఎక్కించేయగా.. ఆర్మీ ఆఫీసర్ పాత్ర మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో.. ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ బజ్ నెలకొంది. ఇక ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ సినిమాపై ఏకంగా దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. ‘బాహుబలి’తో ఇంటర్నేషనల్ ఇమేజ్ రావడం, హాలీవుడ్ రేంజ్ కథతోనే ‘సాహో’ చిత్రం చేస్తుండడంతో.. అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. వీటి తర్వాత అత్యధిక అంచనాల్ని మూటగట్టుకున్న సినిమా ఏదైనా ఉందంటే.. అది ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రూపొందేదే! ఒకరు మాటల మాంత్రికుడు, మరొకరు డైలాగ్స్ చెప్పడంలో కింగ్. ఇద్దరి కాంబో తొలిసారి సెట్ కావడంతో.. తారక్ ఫ్యాన్స్‌తో ఇండస్ట్రీ మొత్తం ఈ చిత్రం కోసం తెగ వెయిట్ చేస్తోంది. ఇలా ఈ ఆరు చిత్రాలతో 2018ని పండగ వాతావరణంలో మార్చబోతున్నారు మన హీరోలు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.