చరణ్-బోయపాటి మూవీకి సాలిడ్ డీల్.. రికార్డ్ అంటే ఇదీ!

అసలే రామ్ చరణ్, బోయపాటి శ్రీనుది క్రేజీ కాంబినేషన్.. వీళ్ళు జతకట్టడంతోనే భారీ క్రేజ్ వచ్చిపడింది.. సరిగ్గా ఇదే టైంలో ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ఆ చిత్రంపై మరిన్ని అంచనాలు వచ్చిపడ్డాయి. అందుకే.. ఇంకా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకముందే ఈ మూవీ సంచలన బిజినెస్ చేస్తోంది.

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల్ని ‘యువి క్రియేషన్స్’ సంస్థ అక్షరాల రూ.72 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం! ‘యువి క్రియేషన్స్’ ఇప్పటివరకు రిలీజ్ చేసిన సినిమాలన్నీ సూపర్‌హిట్లుగా నిలిచినవే! అలాంటి సంస్థ చరణ్-బోయపాటి మూవీని ఏకంగా రూ.72 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం! దీన్నిబట్టి.. ఈ చిత్రం మీద ఏ స్థాయిలో క్రేజ్ వుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మాస్-ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీలో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.