‘స్పైడర్’ ట్రేడ్ రిపోర్ట్: బయ్యర్స్‌కి మిగిలిన భారీ నష్టాల లెక్కలు

spyder trade report areawise loss report

మహేష్‌బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘స్పైడర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామీయే సృష్టిస్తుందనుకుంటే.. అప్పుడే చాప చుట్టేయడానికి రెడీగా వుంది. రిలీజ్‌నాడు డిజాస్టర్ టాక్ రావడంతో.. ఎవ్వరూ ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు వెళ్ళడం లేదు. వీక్ డేస్‌లోనే కాదు.. వీకెండ్స్‌లోనూ ఇదే పరిస్థితి.

ఆల్రెడీ బీ, సీ సెంటర్లలో బిచాణా ఎత్తేసిన ఈ చిత్రం.. త్వరలోనే ఏ సెంటర్ల నుంచి వైదొలగేందుకు సిద్ధమవుతోంది. కనీసం థియేటర్ రెంట్ వసూళ్లు కూడా నమోదు కాకపోతుండటంతో ఈ చిత్రాన్ని లేపేస్తున్నారు. ఇలా ఈ చిత్రం కథ అర్థాంతరంగా కంచికి చేరడంతో.. ట్రేడ్ వర్గాలు ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్‌ని వెల్లడించారు. ఈ రిపోర్ట్ ప్రకారం.. అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లకు భారీ నష్టాలే మిగిలాయి. ఏరియాలవారీగా చూస్తే..

నైజాం : ఈ మూవీ నైజాం రైట్స్‌ని దిల్‌రాజు రూ.24 కోట్లకి కొనుగోలు చేయగా.. ఇప్పటివరకు ఈ మూవీ రూ. 9.6 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. టోటల్ రన్‌లోపు ఈ చిత్రం రూ.10 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా. ఆ లెక్కన దిల్‌రాజుకి రూ.14 కోట్లు నష్టం.

సీడెడ్ : ఈ మూవీ సీడెడ్ రైట్స్ రూ. 12 కోట్లకి అమ్ముడవ్వగా.. ఇప్పటిదాకా రూ.4.6 కోట్లు కలెక్ట్ చేసింది. టోటల్ రన్‌టైంలో రూ.5 కోట్ల వచ్చే అవకాశముందంటున్నారు. అంటే.. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్‌కి రూ.7 కోట్లు నష్టం వాటిల్లుతుంది.

ఉత్తరాంధ్ర : ఈ ఏరియా రైట్స్‌కి రూ.8.1 కోట్ల ధర పలికింది. కలెక్ట్ చేసింది రూ. 3.8 కోట్లు. టోటల్ రన్ ఎస్టిమేషన్ రూ. 4 కోట్లు. అంటే.. రూ.4.1 కోట్లు నష్టం.

గుంటూరు : ఈ ఏరియా రైట్స్‌ని ఓ డిస్ట్రిబ్యూటర్ 7.2 కోట్లకు తీసుకున్నాడు. ఇప్పటివరకు వచ్చిన షేర్ రూ. 3.6 కోట్లు. టోటల్ రన్‌లో నమోదయ్యే వసూళ్ల అంచనా రూ. 3.8కోట్లు. ఈ లెక్కన మిగిలే నష్టం రూ. 3.4 కోట్లు

ఈస్ట్ గోదావరి : ఈ ఏరియా రైట్స్‌కి రూ. 6 కోట్ల ధర పలికింది. ఇప్పటిదాకా వచ్చిన వసూళ్లు 3.7 కోట్లు. టోటల్ రన్ ఎస్టిమేషన్ రూ. 3.8 కోట్లు. అంటే.. డిస్ట్రిబ్యూటర్‌కి వాటిల్లే నష్టం రూ. 2.2 కోట్లు

వెస్ట్ గోదావరి : ఈ ఏరియా రైట్స్‌కి పలికి ధర రూ. 5 కోట్లు. ఇప్పటివరకు వచ్చిన షేర్ రూ. 2.85. టోటల్ రన్ ఎస్టిమేషన్ రూ. 2.9 కోట్లు. ఈ లెక్కన బయ్యర్ నష్టపోయేది రూ. 2.1 కోట్లు

కృష్ణా : ఈ ఏరియా రైట్స్ రూ. 5.4 కోట్లకు అమ్ముడవ్వగా.. వచ్చిన షేర్ రూ. 2.45. టోటల్ రన్‌ ఎస్టిమేషన్ రూ. 2.5 కోట్లు. బయ్యర్ చవిచూసే నష్టం రూ. 2.9 కోట్లు.

నెల్లూరు : ఈ ఏరియా రైట్స్‌కి రూ. 3.2 కోట్లు ధర పలకగా.. ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు 1.8 కోట్లు. టోటల్ రన్ అంచనా రూ. 1.9 కోట్లు. డిస్ట్రిబ్యూటర్‌కి మిగిలే నష్టం రూ. 1.3 కోట్లు.

కర్ణాటక : రైట్స్ రూ.10.8 కోట్ల ధర పలకగా.. టోటల్ రన్‌లో రూ. 6.8 కోట్లు వస్తాయని అంచనా. ఈ లెక్కన డిస్ట్రిబ్యూటర్‌కి మిగిలే నష్టం రూ. 4 కోట్లు.

తమిళనాడు : అక్కడ ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ.. వసూళ్లు పెద్దగా రావడం లేదు. టోటల్ రన్‌లో రూ. 12 కోట్లు వస్తాయని అంచనా. ఈ లెక్కన డిస్ట్రిబ్యూటర్‌కి రూ.6 కోట్ల నష్టం వస్తుంది.
యూఎస్ఏ : యూఎస్‌లో ఈ చిత్రం టోటల్ రన్‌లో రూ. 6 కోట్ల షేర్ కలెక్ట్ చేయొచ్చని అంటున్నారు. ఈ లెక్న డిస్ట్రిబ్యూటర్‌కి మిగిలే నష్టం రూ. 8 కోట్లు.

ఇంకా కేరళ, రెస్టాఫ్ ఓవర్సీస్, మిగిలిన ఏరియాల్లోనూ ఇలాగే నష్టాలు వాటిల్లాయని ట్రేడ్ పండిట్స్ వెల్లడిస్తున్నారు. ఇదండి నష్టాల లెక్క. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.