స్పైడర్ రెండు వారాల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ దసరా కానుకగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ వర్గాల్లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే సినిమా రిలీజ్‌ తరువాత నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై పడింది. దీంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్పైడర్ మహేష్ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా మిగలనుంది. ఇక కలెక్షన్స్ పరంగానూ ఈ చిత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టడంలో విఫలమయ్యింది. స్పైడర్ రెండు వారాలకు గాను తెలుగు, తమిళ భాషల్లో మొత్తంగా 62 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఏరియాల వారిగా స్పైడర్ రెండు వారాల కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏరియా – రెండు వారాల షేర్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 9.71 కోట్లు
సీడెడ్ – 4.66 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.88 కోట్లు
గుంటూరు – 3.57 కోట్లు
తూర్పు గోదావరి – 3.74 కోట్లు
పశ్చిమ గోదావరి – 2.79 కోట్లు
కృష్ణా – 2.54 కోట్లు
నెల్లూరు – 1.83 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 32.72 కోట్లు
కర్ణాటక – 6.50 కోట్లు
తమిళనాడు – 10.6 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.50 కోట్లు
కేరళ – 1.03 కోట్లు
ఓవర్సీస్ – 8.65 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 62 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.