శ్రీరెడ్డికి తిక్క రేగింది.. ‘28’పై అడ్డంగా కేసు

ప్రతిఒక్కరికీ తిక్క ఉంటుంది కానీ దానికో లెక్కుంటుంది. అంటే.. ఎప్పుడు కావాలో అప్పుడే వాళ్ళు తమ తిక్క చూపిస్తారు. కానీ.. శ్రీరెడ్డికి మాత్రం అలాంటి లెక్కలేమీ లేవు. మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్ళిపోవడమే ఆమె పని! పాపులారిటీ దక్కించుకోవాలనే పిచ్చి పీక్స్‌లో ఉండటం వల్లే.. ఇప్పటివరకూ అంత రచ్చ చేసింది. అయితే.. పవన్ వివాదంతో ఆమె సైలెంట్ అయిపోవడంతో.. ఇక శ్రీరెడ్డి తోక ముడుచుకున్నట్లేనని అంతా భావించారు. ఇకపై ఆమె ఎలాంటి పప్పులు ఉడకబెట్టినా.. పెద్దగా ప్రయోజనం ఉండదని జనాలు ఫిక్స్ అయిపోయారు.

ఇదే విషయాన్ని శ్రీరెడ్డి కూడా గ్రహించినట్లుంది. ఇన్నాళ్ళూ ‘క్యాస్టింగ్ కౌచ్’ పేరుతో తాను సంపాదించిన ఇమేజ్ మొత్తం గంగలో కలిసిపోయిందనే మేటర్ ఆమెకి అర్థమైపోయింది. అందుకే.. ఏదో ఒకటి పెద్ద దుమారం రేపితేగానీ తిరిగి తాను లైమ్‌లైట్‌లోకి రాలేననుకుని, ఈసారి మాస్టర్ ప్లాన్ వేసింది. మునుపటిలాగా లీక్స్ చేయడం వల్లనో, ఒక్కరినే టార్గెట్ చేస్తేనో తనని ఎవ్వరూ పట్టించుకోరని గ్రహించిన ఈ అమ్మడు.. పెద్ద బాంబే పేల్చింది. ఏకంగా 28 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం!

జీవితారాజశేఖర్‌, హేతువాది బాబుగోగినేనితో సహా పలువురు సినీ నటులు, ఆర్టిస్టులు, పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌, సోషల్‌ మీడియా.. ఇలా మొత్తం 28 మందిపై శ్రీరెడ్డి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆమె ఆదివారం హుమయూన్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ అశోక్‌ చక్రవర్తికి వినతిపత్రం అందచేసింది. ఇప్పటికీ తనపై వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరింది. సైబర్‌ క్రైం సహకారంతో వివరాలు సేకరించి, ఆపై న్యాయ సలహాలు తీసుకుని కేసు నమోదు చేస్తామని ఏసీపీ వివరించారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.