పవన్‌కి శ్రీరెడ్డి రివర్స్ పంచ్.. లాజిక్‌గా కొట్టిందిగా!

నటి శ్రీరెడ్డి ఇష్యూ మీద రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే! ఇలా టివి ఛానెళ్ళలో రచ్చ చేయడం కంటే.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చి న్యాయపోరాటం చేస్తే బాగుంటుందని శ్రీరెడ్డి పేరు ఎత్తకుండానే పవర్‌స్టార్ సూచించారు. పవన్ వ్యాఖ్యలు సరైనవే అయినా.. కనీస మద్దతు కూడా తెలపకపోవడంపై కొంచెం వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు శ్రీరెడ్డి కూడా తనదైన శైలిలో లాజికల్ కౌంటర్ వేసింది.

‘‘పవన్ కళ్యాణ్ ఫైటింగ్ స్పిరిట్‌ అంటే నాకిష్టం! స్పెషల్ క్యాటగిరీ స్టేటస్‌తో పాటు ఇతర సమస్యల మీద ఆయన చేస్తున్న పోరాటం అభినందించదగినది. అయితే.. కోర్టులకు వెళ్ళకుండా, ప్రభుత్వ సహకారం లేకుండా ఆయన తన పోరాటాల్ని కొనసాగిస్తున్నారు. స్పెషల్ క్యాటగిరీ కోసం పవన్ చేస్తున్న పోరాటం కరెక్ట్ అయినప్పుడు.. ‘క్యాస్టింగ్ కౌచ్’పై నేను చేస్తున్న పోరాటం కూడా సరైనదే! నాకు తెలిసిన మార్గాల్లో పోరాటం చేయడం నాకు పూర్తి హక్కు వుంది’’ అంటూ లాజికల్‌గా పవన్‌కి రివర్స్ పంచ్ ఇచ్చింది శ్రీరెడ్డి.

అంతేకాదు.. తన ఇష్యూ మీద పవన్ స్పందించిన విధానం కూడా తనకు నచ్చలేదని, కనీసం తన పేరు కూడా చెప్పకపోవడం విచారకరమని శ్రీరెడ్డి తెలిపింది. ఫైటర్‌గా పవన్ నాకు కనీస మర్యాద కూడా ఇవ్వకపోవడం బాధాకరంగా వుందని ఆమె చెప్పుకొచ్చింది. మరి.. ఈమె సమాధానంపై పవన్ నుంచిగానీ, ఆయన అభిమానుల నుంచిగానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.