శ్రీరెడ్డి సంచలన నిర్ణయం.. దిల్‌రాజుకి ఎర్త్!

గత రెండు నెలల నుంచి ‘క్యాస్టింగ్ కౌచ్’పై వినూత్న పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి లేటెస్ట్‌గా మరో టర్న్ తీసుకుంది. ఇండస్ట్రీపై అధికారం చెలాయిస్తున్న బడా నిర్మాతలపై పోరాటం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆమె ఏకంగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకి ఎర్త్ పెట్టింది. అవును.. ఇన్నాళ్ళూ ఏ ఒక్కరూ చేయలేని సాహసాన్ని శ్రీరెడ్డి చేసి.. పరిశ్రమను షాక్‌లో ముంచెత్తింది. ఇందుకు ఆమె ఎంచుకున్న మార్గం కూడా విచిత్రమైందే!

శనివారం మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. తన పేరులో ‘రెడ్డి’ అనే పదాన్ని తీసేస్తున్నానని తెలిపింది. ‘రెడ్డి’ వున్న పేరుని మోయడానికి చాలా బరువుగా వుందని చెప్పిన ఆమె.. ఇకనుంచి తన పేరు ‘శ్రీశక్తి’ అని, అందరూ తననలి అలాగే పిలవాలని కోరింది. సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం కూడా ఉందని ఆమె పేర్కొంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు నిర్మాత దిల్‌రాజు చేతుల నుండి బయటకు రప్పించేందుకే తాను ఈ డెసిషన్ తీసుకున్నానని చెప్పిన శ్రీరెడ్డి.. తనని ‘శ్రీశక్తి’ పిలవాలని వెల్లడించింది.

శ్రీరెడ్డి చెప్పిందని కాదు కానీ.. అఫ్‌కోర్స్ ఇండస్ట్రీ-థియేటర్లు కొందరు బడాబాబుల చేతుల్లోనే వుందని ఎప్పట్నుంచో ఒక బలమైన టాక్ వుంది. ఎందరో డిస్ట్రిబ్యూటర్స్ ఈ వాదనని వినిపించారు కూడా! కానీ.. ఏ ఒక్కరూ ఏమీ చేయలేకపోయారు. అలాంటి వారిపై పోరాటం చేసేందుకు దిగొచ్చిన శ్రీరెడ్డి సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే! కానీ.. ఈ పోరాటంలో ఆమె గెలుస్తుందని చెప్పడం కష్టమే!

Related posts:
థియేటర్ వద్ద కొట్టుకున్న బాలయ్య-నాగ్ అభిమానులు (వీడియో)
తన యవ్వనానికి శృంగారమే కారణమంటున్న సింగర్
కూతురి కాపురంలో ‘తల్లి’ చిచ్చు.. అల్లుడితోనే అక్రమ సంబంధం!!
వంగిమరీ ‘బ్రహ్మాండం’ చూపిస్తున్న యాంకర్ రష్మీ
షాకింగ్ న్యూస్: మరోసారి రెడ్‌హ్యాండెడ్‌గా బుక్కైన ఇలియానా
చార్మి ఎప్పటికీ అలానే మిగిలిపోతుందట!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.