నాగబాబుపై ప్రధానికి శ్రీరెడ్డి వాంగ్మూలం.. షాక్‌లో మెగాఫ్యాన్స్

నటి శ్రీరెడ్డి ఏ ఉద్దేశంతో అయితే మీడియా ముందుకొచ్చింది.. అంతకుమించిన పాపులారిటీ ఆమెకి వచ్చిపడింది. తన పోరాటానికి ఇండస్ట్రీ నుంచే కాకుండా సాధారణ జనాల నుంచి కూడా మద్దతు లభించింది. అంతేకాదండోయ్.. కెరీర్‌కి ఢోకా లేకుండా భారీ ఆఫర్లు కూడా దక్కాయి. ఇన్నీ లభించినప్పటికీ ఆమెకింకా ‘ఆశ’ తీరనట్టుంది.. అందుకే మెగాఫ్యామిలీని టార్గెట్ చేసింది.

ఉన్నపళంగా భారీ ఇమేజ్ దక్కాలంటే.. పెద్దోళ్ళనే గోకాలి కాబట్టి ఆ కుటుంబాన్ని అమ్మడు కెలికింది. ఇంతవరకూ ప్రత్యర్థులు, అజాత శతృవులు అనని బూతుపదాన్ని పవన్‌పై వినియోగించి.. పెను దుమారానికి తెరలేపింది. ఓకే.. ఈ దురాగతానికి వర్మనే కారణం! కానీ.. 35 ఏళ్ళున్న శ్రీరెడ్డికి పబ్లిక్‌లో అదికూడా మీడియా ముందు ఆ మాట అనకూడదని బుద్ధి లేదా? తాను ఒక మనిషేనని, అంతకుముందు ఒక మహిళ అనే కనీస ఇంకితజ్ఞానం కూడా లేదా? ఎవడు ఏం తినమన్నా తినేస్తుందా? అసలు ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఎటాక్ చేసే హక్కు, స్థాయి ఈమెకి ఎవరిచ్చారు? కడుపుకి అన్నమే తింటోందా? లేక మరేమైనానా? సరే.. బహిరంగ క్షమాపణ చెప్పింది.. అది వేరే విషయం!

శ్రీరెడ్డి చెప్పిన మాటకి తీవ్రంగా బాధపడ్డ పవన్.. తన ఆక్రోశాన్ని దాచుకోలేక విరుచుకుపడుతున్నాడు. దానికి కాస్త ఫీల్ అయి తన పశ్చాత్తాపం వ్యక్తపరచొచ్చు కదా! ఏదో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అన్నట్లు తిరిగి కౌంటర్లు వేస్తోంది ఈ అమ్మడు! చేసిందే పెద్ద తప్పు.. దానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందిపోయి రివర్స్‌లో తిరుగుబాటు చేస్తోంది. ఇదేమైనా స్వాతంత్ర్య సమర పోరాటమా? లేక తానేమైనా గొప్ప పని చేసిందా! ఇక్కడితో ఆగకుండా ఈమె మరో సంచలనానికి తెరలేపడం విడ్డూరం. తనకు మెగాఫ్యామిలీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని.. ముఖ్యంగా నాగబాబు తనకు కాల్స్ చేస్తూ బెదిరిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొంది.

‘‘నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మెగాఫ్యామిలీలో నాగబాబు దగ్గర నుండి! నాకు ఏమన్నా జరిగితే.. దానికి పూర్తి బాధ్యత మెగాఫ్యామిలీదే. ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం’’ అంటూ ట్వీట్ చేస్తూ.. పీఎంఓఇండియా హ్యాష్‌ట్యాగ్‌తో మోదీకి ఫిర్యాదు చేసింది. ఇది నిజమో, అబద్ధమో తెలీదు కానీ.. ఇలా బెదిరింపులకు పాల్పడేంత దిగజారుడు పనులకైతే మెగాఫ్యామిలీ పాల్పడదు. నిజంగానే ఏమైనా చేయాలనుకుంటే.. తమకున్న ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఉపయోగించుకుని ఈపాటికే ఏదో ఒకటి చేసేవారు. చూస్తుంటే.. శ్రీరెడ్డి కావాలనే మరో డ్రామాకి తెరలేపుతున్నట్లు అర్థమవుతోంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.