‘శ్రీనివాస కళ్యాణం’ సెన్సేషనల్ బిజినెస్.. నితిన్‌కి అంత సీనుందా?

అఫ్‌కోర్స్.. నితిన్ ఇండస్ట్రీలో చాలాకాలం నుంచే ఉన్నాడు. దాదాపు పదేళ్ళ తర్వాత మళ్ళీ గాడిలోకి వచ్చి.. మంచి సినిమాలే చేస్తున్నాడు. కాకపోతే తనకంటూ ఓ మార్కెట్ వ్యాల్యూ ఏర్పరుచుకోలేకపోయాడు. ఓవైపు చిన్న హీరోలు కూడా వరుస హిట్స్‌తో తమ మార్కెట్‌ని పెంచుకుంటూపోతుంటే.. నితిన్ మాత్రం ఒడిదుడుకులతో బండి లాగించేస్తున్నాడంతే! అలాంటి నితిన్‌పై ఇప్పుడు బయ్యర్స్ ఏకంగా రూ.27 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టేశారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం!

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ చేసిన లేటెస్ట్ మూవీ ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా ప్రింట్స్, ఇతర ఖర్చులతో కలుపుకుని ఓవరాల్‌గా రూ.27.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ‘అ ఆ’ (రూ.30.5 కోట్లు) సినిమా తర్వాత ఇది నితిన్‌కి సెకండ్ హయ్యెస్ట్ ఫిగర్! త్రివిక్రమ్ మాయాజాలంతోపాటు సమంత స్టార్‌డమ్ కూడా తోడు కావడంతో ఆ చిత్రం భారీ బిజినెస్ చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ.. ఇప్పుడు అలాంటివి లేవు. రాశీఖన్నా చిన్న హీరోయిన్ల కేటగిరీలోనే వుంది. దర్శకుడు సతీష్ వేగేశ్నకి ఇది ఇంకా రెండో సినిమానే! అయినా రూ.27.5 కోట్ల బిజినెస్ చేసిందంటే.. నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే!

బహుశా నిర్మాత దిల్‌రాజు మీద ఉన్న నమ్మకమో లేక సినిమాల ప్రోమోలు బాగా ఆకట్టుకోవడం వల్లనో తెలీదు కానీ.. బయ్యర్స్ ఇంత పెట్టుబడి పెట్టడం సాహసమనే చెప్పాలి. మరి.. నితిన్ వారి నమ్మకాల్ని నిలబెట్టి అంత మొత్తాన్ని రికవర్ చేసి, లాభాలు తెచ్చిపెట్టగలడా? లేదా? అన్నదే వెయిట్ చేయాలి.

Related posts:
రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు బాలకృష్ణ బాసట
మ‌హేష్‌తో చెల్లికి మాట‌ల్లేవ‌ట‌
ఎన్టీఆర్ మూవీ ప్లాప్ అయినా ఛాన్స్ ఇచ్చాడు!!
మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్‌బాబు.. స్టూడెంట్స్‌కి బహుమానం
పెళ్లిచూపులు స్టార్స్‌‌ను పైకిలేపుతున్న హీరోలు
‘ఈస్ట్’ ఆర్ వేస్ట్.. ‘రంగ’ ఈజ్ ది బెస్ట్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.