‘మిస్టర్’తో డిజాస్టర్స్‌లో అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేసిన శ్రీనువైట్ల

mister-disaster-boxoffice
Tellmeboss.net

శ్రీనువైట్ల.. ఇంతకుముందు ఈ పేరు వినగానే హిట్టు బొమ్మ గ్యారెంటీ అనే అభిప్రాయం వుండేది. అతను తీసే ప్రతి సినిమా బ్లాక్‌బస్టరే అని చెప్పుకునేవారు. కానీ.. ‘ఆగడు’ తర్వాత అతని ఫేట్ మారిపోయింది. అప్పటివరకు వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న వైట్లకి ఆ చిత్రం చెక్ పెట్టింది. ఆ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో.. మనోడికి కళ్లు బైర్లుకమ్మాయి. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఓ సక్సెస్ కావాల్సిందేనని పట్టుబడ్డ వైట్ల.. ఎలాగోలా రామ్ చరణ్‌తో ‘బ్రూస్ లీ’ తీసే ఛాన్స్ పట్టేశాడు. అందులో చిరు క్యామియో రోల్ కూడా వుండడంతో.. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందని, ఇక తనకు తిరుగుండదని భావించాడు. తీరా రిలీజయ్యాక రిజల్ట్ చూస్తే.. ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ చిత్రం కూడా ఫ్లాప్ అయిపోయింది. ఆ దెబ్బతో మనోడు షాక్‌లోకి వెళ్ళిపోగా.. జనాల్లో అతని క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. అతని పేరు వింటేనే ‘అమ్మో.. శ్రీనువైట్ల సినిమానా’ అని చెప్పుకునే స్థితికి క్రేజ్ దిగజారింది.

Tellmeboss.net

ఇక మనోడి కెరీర్ ముగిసిపోయిందని అనుకుంటున్న తరుణంలో.. మెగాఫ్యామిలీ అతనికి మరో అవకాశం ఇచ్చింది. ‘వరుణ్ తేజ్‌తో ఓ సినిమా తీసుకుని.. పాసయ్యే ప్రయత్నాలు చేసుకో’ అని చెప్పింది. ఇంకేముంది.. వైట్ల వెంటనే రంగంలోకి దిగాడు. చకచకా పనులు పూర్తి కానిచ్చి.. సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అంతేకాదు.. తాను పూర్తిగా మారిపోయానని, ‘మిస్టర్’ చూశాక ఆ మార్పు కనిపిస్తుందని డప్పులు వాయించుకున్నాడు. అతని మాటలు నమ్మి.. ఈసారైనా ఛేంజ్ అయ్యాడేమో అనే ఉద్దేశంతో జనాలు థియేటర్లకు వెళ్ళారు. బయటికొచ్చాక అసలు విషయం తెలిసింది.. వైట్ల మారడం కాదు కదా, ఇంకా దారుణంగా తయారయ్యాడని. రొటీన్ కామెడీతో రోత పుట్టించాడని, భారీ యాక్షన్ సీన్లతో తలనొప్పి తెప్పించాడని, ఎక్కువమంది యాక్టర్లతో కన్ఫ్యూజ్ చేసిపారేశాడని ఒకటే విమర్శలు. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడురా బాబూ… అని జనాలు మొత్తుకుంటున్నారంటే, ఈ సినిమా ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

ఇలా టాక్ వస్తే ఇంకేముంది.. బాక్సాఫీస్ వద్ద మూవీ బోల్తా పడింది. రూ.21 కోట్లకుపైగా బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ.25 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఊహిస్తే.. అవి పటాపంచలైపోయాయి. కనీసం.. పదిహేను కోట్ల రేంజిలో వసూలు చేస్తుందని అనుకున్న ఈ చిత్రం ఎనిమిది కోట్లలోపే ఎండ్‌ అయ్యేలాగుంది. ఈ లెక్కన.. పెట్టిన పెట్టుబడిలో కనీసం మూడో వంతు కూడా తిరిగి రాదన్నమాట. దీంతో.. ఈ సినిమాని డిజాస్టర్ కేటగిరీలో చేర్చేశారు. ఈమధ్య కాలంలో ‘ఓం నమో వెంకటేశాయ తర్వాత’ ఈ స్థాయిలో ఫ్లాప్‌ అయిన సినిమా ‘మిస్టర్’ అని అంటున్నారు. వాస్తవానికి.. ‘ఓం నమో’ భక్తిరస చిత్రం కాబట్టి వర్కవుట్‌ కాలేదు. కానీ.. మిస్టర్‌ కమర్షియల్‌ సినిమా. మినిమమ్‌ వసూళ్లైనా రావాలి. కానీ ఈ చిత్రం దారుణమైన వసూళ్లతో రెండవ వారానికి థియేటర్లనుంచి మిస్‌ అయ్యేలాగుంది. ఈసారైనా విజయం సాధిస్తాడనుకుంటే.. డిజాస్టర్స్‌లోనే అత్యంత చెత్త రికార్డ్‌ని నమోదు చేశాడు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.