ప్లేటు ఫిరాయించిన జక్కన్న.. చెప్పిందొకటి చేస్తుందొకటి!

‘బాహుబలి’ తర్వాత తాను చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌లో అసలు గ్రాఫిక్సే వుండదని దర్శకధీరుడు రాజమౌళి ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. అంతేకాదు.. గ్రాఫిక్స్ అవసరం లేని కథ రాయమని తన తండ్రి విజయేంద్రప్రసాద్‌కి చెప్పానని కూడా ఆయన వెల్లడించాడు. కమర్షియల్ ఎమోషనల్ డ్రామా మూవీ చేయబోతున్నట్లు తెలిపాడు.

కట్ చేస్తే.. ఇప్పుడు జక్కన్న ప్లేటు ఫిరాయించేశాడు. కొంచెం కూడా గ్రాఫిక్స్ ఉపయోగించనని చెప్పిన ఈ దర్శకధీరుడు.. ఇప్పుడు దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అవును.. చరణ్, తారక్‌లతో చేయనున్న మల్టీస్టారర్‌లో గ్రాఫిక్స్ పార్ట్ చాలా వుంటుందని టాక్ వినిపిస్తోంది. ఆ యాక్షన్ గ్రాఫిక్స్ వర్క్ మీదే ఆ హీరోలిద్దరూ విదేశాలకు వెళ్ళారని సమాచారం. ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌కి ప్లాన్ చేశారని.. వాటికోసం గ్రాఫిక్స్ వర్క్ కంపల్సరీ చేయాల్సి వస్తోందని లేటెస్ట్ న్యూస్.

అయినా.. జక్కన్న సడెన్‌గా ఇలా ప్లాన్ మార్చడానికి ఒక బలమైన కారణం వుంది. ‘బాహుబలి’ బిగ్గెస్ట్ సక్సెస్ సాధించడంతో.. ఈ మల్టీస్టారర్‌కి దేశవ్యాప్తంగా అమాంతం క్రేజ్ వచ్చిపడింది. ఆల్రెడీ ఇతర భాషా పరిశ్రమల నుంచి డబ్బింగ్ ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. అందుకే.. ఓ మామూలు సినిమాగా తీయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ కొంచెం కొంచెంగా పెద్దదవుతూ భారీగా తయారైంది. ఆ కారణంగా.. షెడ్యూల్స్ కూడా పూర్తిగా మార్చేయాల్సి వచ్చింది.

నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలనుకున్న వర్కింగ్ డేస్ ఇప్పుడు 10 నెలలకుపైగా పెరిగాయి. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకీ మరింత సమయం కేటాయించాల్సి వస్తుంది. నవంబర్‌లో ప్రారంభించి.. ఒక ఏడాదిలో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. దీంతో.. 2019 సమ్మర్‌లో వస్తుందనుకున్న ఈ చిత్రం 2020కి వాయిదా పడింది. ఇదండి అసలు సంగతీ!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.