స్టార్ హీరోయిన్స్ దెబ్బకు వారి అడ్రస్ గల్లంతు

Tellmeboss.net

మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీల్లో ‘ఐటెం సాంగ్స్‌కి వున్న ప్రత్యేకతే వేరు. మాస్ బీట్‌తో, మాట్ భామలతో హీటెక్కించే స్టెప్పులు వేయించడంతో.. అవి మాస్ సినిమాలకే మేజర్ ఎసెట్‌గా నిలిచిపోయాయి. అందుకే దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో ఒక్క స్పెషల్ సాంగ్ అయిన వుండేలా చూస్తారు. గతంలో ఈ పాటలు వేరే భామలతో చేయించేవారు. వీటికోసమే అన్నట్లుగా కొందరిని రంగంలోకి దింపారు.

ఇలాంటి పాటల కారణంగా తమ క్రేజ్ ఎక్కడ తగ్గిపోతుందా అని భయంతో హీరోయిన్లు ఒప్పుకునేవారు కాదు. అందుకే.. వేరే భామల్ని ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేవారు. దీంతో.. తమ కడుపు నింపుకోవడానికి కనీసం ‘స్పెషల్ సాంగ్ కేటగిరి’ అనేది ఒకటుందని కొందరు భామలు సంతోషించారు. కానీ.. ఈతరం హీరోయిన్లు ఇప్పుడు వారికి ఆ సంతోషాన్ని కూడా మిగల్చలేదు. ఆ కేటగిరిలో తామూ దూరి.. వారి పొట్ట మీద కొట్టారు.

Tellmeboss.net

నిన్నటిదాకా ‘ఐటెం’ పాట వినగానే ఆమడదూరం పరుగులు పెట్టిన హీరోయిన్లు.. ఇప్పుడు మోజుపడి మరీ ఆ పాటలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఏదో చిన్నాచితకా సినిమాలు చేసుకునే హీరోయిన్లు ఓకే అంటే ఏమో అనుకోవచ్చు.. ఏకంగా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న కథానాయికలు సైతం ఈ ఐటెం వేషాలు వేసి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఆల్రెడీ తమన్నా వరుస ఐటెం సాంగ్‌లతో దూసుకుపోతుండగా.. కాజల్ అగర్వాల్ కూడా ఈ కేటగిరిలోకి చేరిపోయింది. ఈ లీగ్‌లో శృతి హాసన్ కూడా వుంది. త్వరలోనే ఇతర భామలు కూడా చేరిపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

స్టార్ హీరోయిన్లందరూ ఇలా ఐటెం సాంగ్ లీగ్‌లోకి చేరిపోవడానికి అసలు కారణం.. ఇండస్ట్రీలో పోటీ పెరిగిపోవడమే. నటనలోనే కాకుండా అందాలు ఆరబోయడంలోనూ ఏ ఒక్కరూ వెనుకాడటం లేదు. అందుకే.. అన్ని కేటగిరీల్లో తమ సత్తా చాటుకోవాలని భావించి, ఐటెం సాంగ్స్ చేసేందుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంకేముంది.. ఆల్రెడీ క్రేజ్ వున్న ఐటెం సాంగ్స్‌కి స్టార్ స్టేటస్ యాడ్ అయితే మరింత క్రేజ్ వచ్చేస్తుందని దర్శకనిర్మాతలు భారీ రెమ్యునరేషన్లు ఇచ్చిమరీ హీరోయిన్లను బుక్ చేసుకుంటున్నారు.

దీంతో.. ఐటెం భామలు పూర్తిగా కనుమరుగైపోయారు. ఎవరైతే వయ్యారాలు పోతూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారో.. ఆ ఐటెం భామలు ఇప్పుడు కనిపించడం లేదు. అసలు వీళ్లు ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. వీళ్లు చివరిసారిగా ఎప్పుడు కనిపించారో కూడా క్లారిటీ లేదు. ఓవరాల్‌గా చూస్తే.. వారి కథ కంచికి చేరినట్లే!

Tellmeboss.net
Related posts:
నాగార్జున, రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాఠిల ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్
భావోద్వేగంతో తండ్రికి లేఖ రాసిన సుకుమార్..
‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ యూఎస్ కలెక్షన్స్
‘జనతా గ్యారేజ్’ 5 వారాల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్
‘రోబో-2’ ఫస్ట్‌లుక్ పోస్టర్.. ఆ హాలీవుడ్ సినిమాకి కాపీ!
ఎవరికి పేరు ఎక్కువ వచ్చింది?!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.