మహానటికి బంపర్ ఆఫర్..!

టాలీవుడ్‌ లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవిత కథను ‘మహానటి’ అనే బయోపిక్ రూపంలో తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాపై మొదట్నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ జీవితానికి సంబంధించిన చిత్రం కావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. ఇక ఈ సినిమా రిలీజ్ కావడం, పాజిటివ్ టాక్‌ సాధించడం, సూపర్ హిట్‌గా మారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం చకచకా జరిగిపోయాయి.

ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం టీవీ ఛానళ్లు పోటీ పడుతున్నాయి. గతంలోనే ఈ సినిమా రిలీజప్పుడు మహానటి శాటిలైట్ రైట్స్‌‌కు రూ.11 కోట్ల ఆఫర్ వచ్చింది. కానీ చిత్ర ప్రొడ్యూసర్లు ఈ డీల్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో ఈ శాటిలైట్ రైట్స్‌కు ఇప్పుడు ఏకంగా రూ.22 కోట్ల ఆఫర్ ఇచ్చాయి సదరు టీవీ ఛానళ్లు. అయితే ఇంతటి భారీ ఆఫర్ వచ్చినా కూడా చిత్ర నిర్మాతలు ఇంకా ఈ డీల్‌ను ఫైనల్ చేయలేదు.

కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో అదరగొట్టిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండలు ముఖ్యమైన పాత్రలు చేశారు. మరి ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ఎంతమొత్తానికి అమ్ముడవుతాయో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.