డబ్బులిస్తేనే.. లేకపోతే పట్టించుకోనంటున్న సన్నీలియోన్

Sunny Leone She Gave Importance To Fans More Than Critics

ఏదైనా ఓ సినిమా రిలీజ్ అయ్యిందంటే ముందుగా విమర్శకులు దానిపై స్పందిస్తారు. ఆ మూవీ బాగుంటే ప్రశంసించడం లేకపోతే విమర్శించడమే వారి పని. వీరు వెల్లడించే అభిప్రాయాల మీదే సినిమా హిట్టా, ఫ్లాపా అనేది ఆధారపడి వుంటుంది. అయితే.. ఇలాంటివారి అభిప్రాయాల్ని తాను అస్సలు పట్టించుకోనని ఒకప్పటి పోర్న్‌స్టార్, ఇప్పుడు బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సన్నీలియోన్ వెల్లడించింది. ఎందుకంటే వారు టికెట్ లేకుండానే సినిమా చూసి ఇష్టమొచ్చినట్లుగా అభిప్రాయాల్ని వెల్లడిస్తారని, కానీ అభిమానులు మాత్రం టిక్కెట్లు కొంటారని తెలిపింది. అందుకే తాను విమర్శకుల అభిప్రాయాలకంటే డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనే అభిమానులకే ప్రాధాన్యమిస్తానని సన్నీ చెప్పుకొచ్చింది.

జాస్మిన్ డిసౌజా దర్శకత్వంలో సన్నీలియోన్ కథానాయికగా నటించిన ‘ఒన్ నైట్‌ స్టాండ్‌’ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలో ఇస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ‘మీరు విమర్శకుల అభిప్రాయం, అభిమానుల ప్రేమలో దేనికి ప్రాముఖ్యత ఇస్తారు’ అనే ప్రశ్నకి సన్నీలియోన్ బదులిస్తూ.. ‘‘విమర్శకులు సినిమా టిక్కెట్లను కొనుక్కోకుండానే ఉచితంగా సినిమా చూస్తారు. కానీ.. అభిమానులైతే టిక్కెట్లను కొంటారు. నాకు సంబంధించినంత వరకు అభిమానులకే ప్రాధాన్యం’’ అని చెప్పింది. సన్నీ చెబుతున్న మాటల్ని చూస్తుంటే.. ఆమె దృష్టిలో డబ్బిచ్చేవాళ్ళే తన అభిమానులని, లేకపోతే లేదని పరోక్షంగా అభిప్రాయాన్ని వెల్లడించిందన్నమాట. అలాగే తనకు అవార్డుల మీద ఎలాంటి ఆసక్తి లేదని.. అభిమానుల ప్రేమే తన ముఖ్యమని తెలిపింది. ‘‘నేను ఏ అవార్డులనూ ఆశించను. కేవలం నా అభిమానుల ప్రేమనే కోరుకుంటాను. వాళ్ల మద్దతునే నేను ఆశిస్తాను’’ అని ఈ సెక్సీ భామ చెప్పింది.

ఇక కంటెంట్‌ ప్రధాన సినిమాల ఆఫర్ల గురించి సన్నీ మాట్లాడుతూ.. ‘‘నటులుగా మేం కంటెంట్ బాగున్న సినిమాల కోసమే ఎదురుచూస్తాం. అయితే కంటెంట్‌ ప్రధాన చిత్రాలనేవి వ్యక్తుల అభిరుచి మీద ఆధారపడి ఉంటాయి. నేను బలమైన విషయం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నానని నమ్ముతున్నా’’ అని సన్నీ చెప్పింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.