రంగస్థలంలో ఉయ్యాలవాడ.. అసలేం జరుగుతోంది?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రీసెంట్ మూవీ రంగస్థలం బాక్సాఫీస్‌ను ఎలా చెడుగుడు ఆడుకుందో అందరికీ తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రివెంజ్ డ్రామా పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించారు. రంగస్థలం అనే ఊరులో జరిగే కథగా ఈ సినిమాను మనకు చూపించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో రంగస్థలం ఊరు కోసం వేసిన సెట్స్ చిత్రానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

ఇప్పుడు ఇదే సెట్స్‌ను వాడుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా ‘‘సైరా’’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రంగస్థలం సెట్స్‌‌లో జరుపుతున్నారు చిత్ర యూనిట్. నరసింహా రెడ్డి కాలం నాటికి సరిపోయే విధంగా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌ రంగస్థలం సెట్స్‌లో ఉండటంతో సురేందర్ రెడ్డి ఇక్కడ కొన్ని ముఖ్యమైన సీన్స్‌ను షూట్ చేస్తున్నాడు.

ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక కీలకపాత్రలో నటిస్తు్న్న సంగతి తెలిసిందే. రంగస్థలం సెట్స్‌లో జరుగుతున్న షూటింగ్‌లో మిల్కీ బ్యూటీ కూడా పాల్గొంటుంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు.

Related posts:
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’కి సెన్సార్ ఇచ్చిన రివ్యూ ఇదే!
ఊహించని ఫీలింగ్‌తో మరో సైకాల‌జిక‌ల్ థ్రిల్ల‌ర్‌.. ‘వాడు వీడు.. ఓ క‌ల్ప‌న‌’
బాలయ్యపై జగన్ స్పెషల్ డాక్యుమెంటరీ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
రుస్తుం ట్రైలర్ టాక్: మొత్తానికి ఏదో ఉంది! హీరోనా విలనా?
నాకు ఆయనే కావాలి - కొరటాల శివ
15 న 14 సినిమాల దండయాత్ర.. పూర్తి వివరాలు!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.