63 ఏళ్ళ నటుడితో తమన్నా మూడో పెళ్ళికి రెడీ

‘‘తమన్నాకి ఇదేం పోయేకాలం! మిల్కీలాంటి నిగనిగలాడే అందం, ఆస్తి, అందస్తు, బోలెడన్నీ ఆఫర్లు రయ్యిన పరిగెత్తుతున్న సినీ కెరీర్… ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ ఆమె 63 ఏళ్ళ నటుడితో మూడో పెళ్లికి ఒప్పుకోవడమేంటి?’’ అని అనుకుంటున్నారా! అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే.. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది రియల్ లైఫ్ గురించి కాదు.. రీల్ గురించి!

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న తన 151వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే! ఇందులో ఇదివరకే నయనతార, ప్రగ్యా జైస్వాల్‌లను హీరోయిన్లను ఎంపిక చేశారు. లేటెస్ట్‌గా మూడో కథానాయికగా తమన్నాని సెలెక్ట్ చేశారు. ఈ విషయం స్వయంగా తమన్నానే వెల్లడించింది. ఇందులో తాను చిరుకి మూడో భార్యగా నటిస్తున్నానని తెలిపింది. ‘నా ఫేవరేట్ యాక్టర్స్ అయిన చిరంజీవి, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి నటిస్తుందన్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. నా క్యారెక్టర్ కోసం చాలా అన్వేషిస్తున్నాను. నా రోల్ చాలా సహజంగా వుండేలా నా వంతు కృషి చేస్తా’’ అని తమన్నా చెప్పుకొచ్చింది.

యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం నయనతార, ప్రగ్యాలిద్దరూ సిద్దమ్మ, పేరమ్మ పాత్రల్లో నటిస్తుండగా.. తమన్నా ఓబులమ్మా అనే క్యారెక్టర్‌లో కనిపించనుంది. కాగా.. తమన్నా ఇదివరకే చరణ్‌తో కలిసి ‘రచ్చ’ సినిమాలో నటించింది. సో.. కాజల్ లాగే కొడుకుతో కలిసి నటించాక తండ్రితో రొమాన్స్ చేయబోతున్న రెండో హీరోయిన్‌గా తమన్నా రేర్ రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.

Related posts:
ప‌వ‌న్ కోసం దిగి వ‌చ్చిన ప్ర‌భాస్‌
తమన్నా ‘స్వింగ్స్’కి తారక్ విజిల్స్
ఆమెను లేపడానికి రంగంలోకి దిగిన నాగబాబు!
బాలయ్య దెబ్బకు పత్తా లేకుండా పారిపోయిన ఎన్టీఆర్!
‘చల్తే చల్తే’ ట్రైలర్ రివ్యూ-రేటింగ్: పప్పులో కాలేసిన జనాలు.. రావు రమేష్ అసలు ట్విస్ట్!
ఎమ్మెల్యే ‘పటాస్’ పేల్చకపోతే.. బయ్యర్ల బతుకు బస్టాండే!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.