‘నా నువ్వే’ అంటూ ‘రెండు’ తన్నుకుపోయిన తమన్నా

‘బాహుబలి’ తర్వాత మిల్కీబ్యూటీ తమన్నాకు క్రేజీ ఆఫర్స్ దక్కలేదన్న మాట వాస్తవమే కానీ.. ఆమె క్రేజ్ పడిపోయిందన్నది మాత్రం అబద్ధం! స్టార్ స్టేటస్‌కి తగ్గట్టు ఛాన్సులు రాలేదు కానీ.. ఆ హోదాకి తగ్గట్టు రెమ్యునరేషన్ మాత్రం బాగానే పుంజుకుంటోంది. పైకి కనబడటం లేదు కానీ.. లోన మాత్రం ఈ అమ్మడు చాలానే గుంజుతోంది. ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌కి జోడీగా నటించిన ‘నా నువ్వే’ సినిమాకైతే అక్షరాల రూ.1.80 కోట్లు పుచ్చుకున్నట్లు సమాచారం!

ఈరోజుల్లో చాలామంది స్టార్ హీరోయిన్లు ఇంకా రూ.1 కోటి మాత్రమే పారితోషికం తీసుకుంటున్నారు. ఇంకొందరికి మహా అయితే మరో 20-30 లక్షలు ఎక్కువ ఉండొచ్చేమోగానీ.. అంతకంటే ఎక్కువగా ఏ ఒక్కరూ డిమాండ్ చేయట్లేదు. ఈమధ్య కొత్త భామల హడావుడి బాగా పెరిగిపోయింది కాబట్టి.. తాము ఎక్కువగా అడిగితే ఎక్కడ సినిమాల్లోకి తీసుకోరనే భయంతో ఫిగర్‌ని తగ్గించుకుంటున్నారు. కానీ.. ఓ మీడియం రేంజ్‌కి సినిమాకి తమన్నా ఏకంగా ఇరవై తక్కువ రెండు కోట్లు అందుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే! ఒకవిధంగా చూస్తే.. సినిమా బడ్జెట్ సింహభాగం హీరోయిన్ పారితోషికంకే వెళ్లిందని చెప్పుకోవచ్చు.

అయినా నిర్మాతలు అంత అమౌంట్ ఇచ్చి ఆమెని పెట్టుకోవడానికి కారణం.. దర్శకుడు జయేంద్రే! తాను రాసుకున్న పాత్రకి తమన్నా అయితేనే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని భావించి.. నిర్మాతలను ఒప్పించి మరీ ఆమె డిమాండ్ చేసినంత అమౌంట్ ఇప్పించాడని తెలుస్తోంది. మరి.. తాను పుచ్చుకున్న దానికి సినిమాలో తమన్నా పూర్తి న్యాయం చేస్తుందో లేదో చూడాలి!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.