షాకింగ్ న్యూస్: చిరుతో సై అంటున్న మిల్కీబ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మూవీ ‘‘సైరా నరసింహా రెడ్డి’’ గురించి ఎలాంటి న్యూస్ బయటకు వచ్చినా ఆసక్తిగా చూస్తున్నారు జనాలు. కాగా ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయంపై ఇండస్ట్రీ జనాల్లో చాలా ఆసక్తి నెలకొంది. చిరంజీవి అదిరిపోయే లుక్‌లో ఈ సినిమాలో మనకు కనిపిస్తాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది.

చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తుందనే విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నానంటూ మిల్కీ బ్యూటీ తమన్నా చెబుతుంది. అవును.. ఇది నిజం. చాలా సెలెక్టివ్‌గా సినిమా ఛాన్సులు కొట్టేస్తున్న తమన్నా ఇటీవల బాహుబలి చిత్రానికిగాను దాదా సాహెబ్ ఫాల్కె అవార్డును సొంతం చేసుకుంది. ఈమె అందంతో పాటు అభినయానికి సైతం ఫ్యాన్స్ నీరాజనాలు పట్టడంతో అమ్మడికి అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

కాగా ఇప్పుడు సైరా చిత్రంలో తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నే కన్ఫర్మ్ చేసిన తమన్నా చిరంజీవి, అమితాబ్ బచ్చన్‌లు తనకు ఎంతో ఇష్టమైన నటులని వారితో కలిసి నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నానని సంబరపడిపోయింది. అయితే ఈ సినిమాలో తమ్మూ ఎలాంటి పాత్ర చేస్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.