రాజశేఖర్-తమ్మారెడ్డి గొడవలో ఊహించని ట్విస్ట్.. ఫ్యూజులు గాయబ్!

ఒకప్పుడు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో రాజశేఖర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అతనితో చేసిన ‘వేటగాడు’ సినిమా వల్లే తన కెరీర్ సర్వనాశమైందని, షూటింగ్‌కి టైంకి రాకుండా చాలా ఇబ్బందులు పెట్టాడని, రాజశేఖర్‌తో సినిమా చేయొద్దని చాలామంది చెప్పినా తాను వినకుండా సినిమా చేసి చేతులు కాల్చుకున్నానని ఓ రేంజులో ఆరోపణలు చేశారు.

ఈ కామెంట్స్‌పై రాజశేఖర్ అప్పుడే రియాక్ట్ అవ్వలేదు కానీ.. రీసెంట్‌గా ‘గరుడవేగ’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన స్పందించాడు. తాను షూట్‌కి ఆలస్యం వచ్చేమాట వాస్తవమేగానీ.. మరీ గంటల తరబడి లేటుగా ఏమీ రాలేదని, తనవల్లే కెరీర్ నాశనమైందని తమ్మారెడ్డి చెప్పడం తనని చాలా బాధించిందని అన్నారు. తాను లేట్‌గా రావడం వల్లే ‘వేటగాడు’ ఫ్లాప్ అయ్యిందనే విషయం పక్కనపెడితే.. అంతకుముందు, తర్వాత తమ్మారెడ్డి ఎలాంటి సినిమాలు చేశారో ఓసారి చూసుకోవాలని సూచించాడు. నిజానికి.. ఆ చిత్రానికిగాను తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఎగ్గొట్టాలని తమ్మారెడ్డి భావించారని.. ఆ విషయంలో తాను పట్టుదలతో వ్యవహరించి మరో దర్శకుడి సహాయంతో డబ్బులు రాబట్టుకున్నానని, ఆ కోపంతోనే తమ్మారెడ్డి తనపై అలాంటి ఆరోపణలు చేశారని రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు.

మరి ఈ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో అని అనుకుంటున్న తరుణంలో.. చివరికి ఆయన రాజశేఖర్ కామెంట్లపై స్పందించారు. కానీ.. ఈసారి ఆయన స్వరం మారింది. మునుపటిలా రాజశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయకుండా చాలా పాజిటివ్‌గా మాట్లాడారు. ‘వేటగాడు’ షూటింగ్ టైంలో రాజశేఖర్ ఇబ్బంది పెట్టడంతో షూటింగ్ డిలే అయిన మాట వాస్తవమే అని.. అలాగని అతను చెడ్డవాడని అనలేనని తమ్మారెడ్డి అన్నారు. రాజశేఖర్‌లో మంచి లక్షణాలు చాలా ఉన్నాయని, అతనో గొప్ప నటుడని, అలాంటి నటుడు తెలుగులో మరొకరు లేరని చెప్పారు. ఇటీవల ‘గరుడవేగ’ సినిమా చూసి రాజశేఖర్‌కు ఫోన్ చేసి అభినందించినట్లు ఆయన వెల్లడించారు.

రాజశేఖర్ వ్యక్తిగతంగానూ చాలా మంచివాడని, వైద్యుడిగా కూడా చాలా మందికి సాయం చేస్తాడని, ఇండస్ట్రీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే వెళ్లి తనవంతు చికిత్స అందిస్తాడని, ఈ మంచి లక్షణాల్ని తాను విస్మరించలేనని తమ్మారెడ్డి తెలిపారు. అయితే ‘వేటగాడు’ సినిమా విషయంలో మాత్రం తాను చాలా దెబ్బతిన్నానని.. పారితోషకం విషయంలో రాజశేఖర్‌ను తాను ఇబ్బంది పెట్టిన మాట నిజమేనని.. అతను ఎలాగోలా పట్టుబడి డబ్బులు వసూలు చేయించుకున్నా పూర్తి పేమెంట్ ఇవ్వలేదని, రాజశేఖర్ వల్ల ఒక రోజు ఆలస్యంగా సినిమా రిలీజై.. ఆ రకంగా కూడా తాను చాలా నష్టపోయానని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

Related posts:
స‌రైనోడు ఎక్క‌డున్నాడో తెలుసా ?
మరో కొత్త రికార్డును తన ఖాతాలో లిఖించుకున్న ధోనీ
యాంకర్ స్వాతి, చంద్రల మధ్య ‘శృంగార’ గొడవకి ఫుల్‌స్టాప్!
ప్రభాస్‌కి అరుదైన గౌరవం.. కెన్యాకు రమ్మంటూ గవర్నర్ లేఖ
న్యూడ్ సెల్ఫీ దిగి.. అడ్డంగా బుక్కైంది! ఆపై ఆమె నాన్న కూడా..!
‘ఛాన్స్ కావాలంటే.. నాతో ఒక రాత్రి గడపాల్సిందే’ : రెజీనా చెప్పిన నిప్పులాంటి నిజం

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.