రాజశేఖర్‌తో ఎఫైర్.. పచ్చినిజాలు చెప్పిన తారాచౌదరి

తారాచౌదరి, రాజశేఖర్‌ల మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లు కొన్నేళ్ళ క్రితం ఒక రూమర్ ఇండస్ట్రీలో పెనుదుమారమే రేపింది. రాజశేఖర్‌తో తారా దిగిన ఒక సెల్ఫీ బయటికొచ్చాక.. ఈ అక్రమసంబంధ వార్త వైరల్ అయ్యింది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆరోజుల్లోనే రాజశేఖర్ ఖండించినప్పటికీ.. ఈ న్యూస్ చల్లారలేదు. నిజంగానే వీరి మధ్య ఎఫైర్ ఉండొచ్చనే బలమైన వాదనలు సాగాయి. ఏదో ఒకరోజు దీనిపై క్లారిటీ పక్కాగా వస్తుందని అనుకున్నారు. ఎట్టకేలకు ఇన్నాళ్ళ తర్వాత తారా ఆ వార్తలపై స్పందించింది. తమ మధ్య ఎలాంటి బంధముందో పచ్చినిజాలు బయటపెట్టింది.

‘‘రాజశేఖర్ అంటే నాకెంతో అభిమానం. ‘మా అన్నయ్య’ సినిమా చూశాక నేను ఆయన అభిమానిని అయ్యాను. హైదరాబాద్‌కి వచ్చాక ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో కలిశాను. మీ అభిమానినంటూ ఆయనతో పరిచయం చేసుకున్నాను. ‘మా అన్నయ్య’ సినిమా నాకెంతో నచ్చిందని చెప్పడంతో ఆయనెంతో హ్యాపీగా ఫీలయ్యారు. ఒకరోజు రాజశేఖర్, జీవిత ఇద్దరూ కలిసి శ్రీనగర్ కాలనీలో నేనుంటున్న ఫ్లాట్ పక్కనున్న ఇంటిని చూడ్డానికి వచ్చారు. కానీ స్థలం సరిపోకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ టైంలోనే నేను ఆయనతో సెల్ఫీ దిగాను. నాకు, ఆయనకు మధ్య ఎఫైర్ ఉన్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆయన నిజంగా చాలా మంచి మనిషి’’ అని తారా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తామిద్దరం కలిసిన ప్రతిసారి ఆప్యాయంగా పలకరించుకుంటామని, ఆయనతో సెల్ఫీ తీసుకున్నందుకు చాలామంది తనని బ్లేమ్ చేశారని, చివరికి రాజశేఖర్‌ని కూడా బెదిరించారని తారా పేర్కొంది. నిజంగా తామిద్దరి మధ్య ఎలాంటి పప్పులు ఉడకలేదని ఆమె మరోసారి స్పష్టం చేసింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.