‘తారకమంత్రం’కి నిత్యా ఫ్లాట్..! (వీడియో)

Tarak Formula For Nithya Menen

Tarak Formula For Nithya Menen. Tollywood and sensational news updates Neticinema is one among the best. Experience the unique presentation of articles for the film industry latest updates and trending news.

పరిచయం లేని నటీనటులు తొలిసారి కలిసి పనిచేస్తున్నపుడు.. మాట్లాడడానికి జంకుతుంటారు. ఏం మాట్లాడాలో తెలీక ముఖంపై ‘ఆశ్చర్యార్థకం’ మార్క్ పెట్టుకుని ఒకరికొకరు చూస్తూ ఉండిపోతారు. ఇలాంటి బిడియమే నిత్యామీనన్‌లోనూ కలిగింది. తొలిసారి యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో పనిచేసిన ఆ అమ్మడు.. ప్రారంభంలో అతనితో ఎలా పరిచయం పెంచుకోవాలా? అంటూ సందిగ్ధంలో పడిపోయిందట. ఆమె ముఖంపై ఈ ప్రశ్నార్థకాన్ని గమనించిన ఎన్టీఆర్.. తన ‘మంత్రం’తో ఫ్లాట్ చేసేశాడు. అదెలాగో తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరికీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలామందికి గ్లామర్ పరంగా ఓ ఇమేజ్ ఉంటే.. నిత్యామీనన్‌ని విలక్షణ నటిగా ఓ పేరుంది. ఆ పాయింట్‌తోనే నిత్యాని తన మంత్రంతో పడేసి.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు ఎన్టీఆర్. ఈ విషయాన్ని స్వయంగా నిత్యానే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘‘ప్రారంభంలో ఎవరితో ఎలా ఉండాలో తెలియలేదు. వాళ్ళు ఎలా ఉంటారో? వారి బిహేవియర్ ఏంటి? అనే ప్రశ్నలు నన్ను ‘వారితో పరిచయం ఎలా పెంచుకోవాలా?’ అనే సందేహంలో పడేశాయి. సినిమాటోగ్రఫర్ తిరుతో నాకు ముందే పరిచయం ఉండడంతో కాస్త రిలీఫ్‌గా ఫీలయ్యాను. ఆయన ద్వారా తారక్, కొరటాల శివతో పరిచయం ఏర్పడింది. సీన్ విన్న తర్వాత షాట్‌కి రెడీ అయినప్పుడు నేను తారక్‌తో మరోసారి ఆ సీన్ గురించి చర్చిస్తుండగా.. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు.

ఇదే ఆ తారకమంత్రం:
‘మనం పని మొదలుపెట్టడానికి ముందు మీకో విషయం చెప్పాలి. నేను మీకు బిగ్ ఫ్యాన్‌ని. మీతో కలిసి పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే.. మీరు చాలా బాగా నటిస్తారు. మీరు చేసిన సినిమాలన్నీ చూశాను. మీతో కలిసి వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’ అని తారక్ నాతో అన్నారు. ఆయనలాంటి స్టార్ యాక్టర్ నా గురించి అలా చెప్పడం నాకు సంతోషాన్ని కలిగించింది. తారక్ అలా మాట్లాడిన తర్వాత నేను చాలా రిలాక్స్ అయ్యాను. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు’’ అని చెప్పుకొచ్చింది. సినిమాలో ఎన్టీఆర్‌ని బోరింగ్ క్యాండిడేట్ అని చెప్పిన నిత్యా.. రియల్ లైఫ్‌లో చాలా ఫ్రెండ్లీ అంటూ శుభం కార్డ్ పలికింది.

అంటే.. నిత్యామీనన్‌కి ఉన్న మంచి నటి అనే గుర్తింపునే ఎన్టీఆర్ తన మంత్రంగా మార్చుకుని, ఆమెని తన మాటలతో ఫిదా చేసి, పరిచయం చేసుకున్నాడన్నమాట. ఈ లెక్కన.. ఎప్పుడూ అందం గురించి కాకుండా అమ్మాయిల్లో ఉన్న మంచి గుణాలను, ట్యాలెంట్‌ని పొగిడి.. వారిని ఫ్లాట్ చేయవచ్చునని తారక్ ఓ హింట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.