తారక్ తెలివికి హ్యాట్సాఫ్!

Tellmeboss.net

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ‘జై లవ కుశ’ సినిమాతో మనముందుకు వచ్చి బాక్సాఫీస్‌పై తన పంజా విసిరాడు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘జై లవ కుశ’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక కలెక్షన్స్ పరంగానూ ఈ సినిమా విజయఢంకా మోగించింది. ఇప్పుడు తారక్ నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టారు అందరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు తారక్.

Tellmeboss.net

కానీ త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి చేస్తున్న సినిమా పూర్తయ్యే సరికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాకే తారక్‌తో సినిమా చేస్తాడు త్రివిక్రమ్. అయితే ఈ గ్యాప్‌లోనే తారక్‌ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి తారక్‌తో సినిమా చేసేందుకు ఇప్పుడున్న డైరెక్టర్స్ ఎవరూ ఖాళీ లేకపోవడంతో తారక్‌ కొత్త ట్యాలెంట్‌ కోసం చూస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు‌తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్న తారక్, ఆ ప్రాజెక్ట్ కోసం ఓ కొత్త డైరెక్టర్‌ను వెతుకుతున్నాడు.

మరి తారక్‌ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా తారక్ తన నెక్ట్స్ మూవీని వీలైనంత త్వరగా తీయాలని చూడటంతో ఫ్యాన్స్‌లో సందడి మొదలయ్యింది.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.