‘అజ్ఞాతవాసి’పై ‘ఆదర్శ్’వంతమైన ట్వీట్లు.. నిజంగా ఇదో తుఫానే!

Tellmeboss.net

మన తెలుగు సినిమాలపై లోకల్ సెలబ్రిటీల కంటే వేరే ఇండస్ట్రీ వాళ్లు ప్రశంసలు కురిపించడంలోనే అసలైన కిక్ ఉంటుంది. వాళ్లు చేసే ప్రతి కామెంట్‌కి ఇక్కడ రొమాలు మామూలుగా నిక్కబొడుచుకోవు.. ఇదిరా అసలైన ఎమోషన్ అంటూ మనలో దాగివున్న రోషం ఒక్కసారిగా జబ్బచరిచి బయటికి పొంగుకొస్తుంది. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగించేలా బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘అజ్ఞాతవాసి’పై ఓ రేంజులో పొగడ్తలు కురిపించేశాడు.

‘అజ్ఞాతవాసి’ సినిమాని యూఎస్‌లో భారీఎత్తున రిలీజ్ చేయడంతో.. ప్రీమియర్స్ ద్వారానే ఇది ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల(9 కోట్ల 65 లక్షల రూపాయలు)కు పైగానే కలెక్ట్ చేసింది. బరిలో ఉన్న హాలీవుడ్ సినిమాల్ని సైతం వెనక్కు నెట్టేసి ఈ చిత్రం వాటికంటే భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఒక ప్రాంతీయ చిత్రం హాలీవుడ్ మూవీల్ని సైతం తొక్కేస్తూ ఇలా ప్రభంజనం సృష్టించడాన్ని చూసి ఖంగుతిన్న ఆయన.. తన ఫీలింగ్స్‌ని దాచుకోలేక తారాస్థాయిలో ప్రశంసలు కురిపించాడు.

Tellmeboss.net

‘దీన్ని తుఫాన్ అనాలా..? సునామీ అనాలా..? టైఫూన్ అనాలా..? నిజం ఏంటంటే.. తెలుగు సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిలిచింది. అవును.. ‘అజ్ఞాతవాసి’ చిత్రం భూమి బద్దలయ్యే రేంజులో అక్కడ భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టింది. మంగళవారం వేసిన ప్రివ్యూస్ ద్వారా ఏకంగా $ 1,513,540 (రూ.9.65 కోట్లు గ్రాస్) రాబట్టింది. వర్కింగ్ డే అయినా కూడా.. ఈ రేంజ్ కలెక్షన్లను సాధించిన ఈ చిత్రాన్ని అద్భుతం కాకుండా ఇంకా ఏమంటారు?’ అంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

దీన్ని చదువుతుంటే మీక్కూడా గూస్‌బంప్స్ వస్తున్నాయి కదా.. అదీ తెలుగోడి సత్తా అంటే! ఓవరాల్‌గా రిజల్ట్ ఎలా వుంటుందో తెలీదు కానీ.. అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం తొలిరోజు ఇలా రాక్షసిలా బాక్సాఫీస్‌ని పీల్చిపిప్పి చేసింది.

Tellmeboss.net
Related posts:
రోహిత్‌ మేనేజర్‌నంటూ డబ్బులు దోచుకున్న అభిమాని
ఆ సీన్లలో నటించలేక ఇబ్బంది పడ్డానంటున్న కాజల్ అగర్వాల్
మహేష్ బావ సినిమాకి ‘భలే మంచి’ ఆఫర్.. బంపర్ ప్రైజ్‌కి సాటిలైట్ రైట్స్
ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. మరోసారి ‘బాంబ్’ పేల్చిన మహేష్‌బాబు
రంగంలోకి దిగిన హిట్ కాంబినేషన్.. ఈసారి బాక్సాఫీస్ బద్దలే!
సినిమా హిట్టు.. సీక్వెల్ నెక్ట్స్ అంటున్న విశాల్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.