కారేసుకొస్తున్న టాక్సీవాలా!

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో మనోడికి ఎక్కడలేని క్రేజ్ వచ్చి పడింది. ఇప్పుడు ఇదే క్రేజ్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సీవాలా. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే జనాల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

గతంలో టాక్సీవాలా ఫస్ట్ గేర్ అంటూ వచ్చిన ఒక చిన్న వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు విజయ్. ఏప్రిల్ 17న టాక్సీవాలా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరోసారి తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఎస్‌కెఎన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా టీజర్ ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.