జియోపై యుద్ధం.. దిమ్మతిరిగే స్మార్ట్‌ఫోన్ ఆఫర్

టెలికాం రంగంలో జియో సృష్టించిన తుఫాను గురించి అందరికీ తెలిసిందే. 4G స్పీడ్‌తో కొత్త చరిత్ర సృష్టించిన జియో మిగతా టెలికాం కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అతి తక్కువ ధరలకు సరికొత్త ప్లాన్లతో కస్టమర్లను తనవైపు తిప్పుకుంటున్న జియో దెబ్బకు మిగతా టెలికాం కంపెనీలు విలవిలలాడుతున్నాయి. అయితే గతకొంత కాలంగా జియో ఆధిపత్యాన్ని చూసిన ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలు ఇప్పుడు ఓ సరికొత్త ఆఫర్‌తో వచ్చి జియోను దెబ్బ తీసేందుకు రెడీ అవుతున్నాయి.

ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలు కలిసి రూ.500కే సరికొత్త 4G స్మార్ట్‌ఫోన్‌‌ను మార్కెట్‌లోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అందేగాక నెలకు కేవలం రూ.60కే అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ సర్వీసులను అందించడానికి ఈ కంపెనీలు రెడీ అయ్యాయి. జియో తన కస్టమర్లకు 4G స్పీడ్‌తో డేటాను అందిస్తున్నప్పటికీ వాయిస్ కాల్స్ మాత్రం 2G స్పీడ్‌తోనే అందిస్తున్నాయి. రూరల్ ఏరియాల్లో మిగతా నెట్‌వర్క్‌లనుండి మద్దతు లేకపోవడంతో జియో ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఇదే విషయంలో మిగతా వారు తమ జోరును చూపించనున్నారు. జియోకంటే తక్కువ ధరలో ఈ ఆఫర్‌ వస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కస్టమర్లను తమవైపు తిప్పుకోవడం ఖాయమని ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

మరి ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్‌తో కస్టమర్లను ఎంతమేర ఆకర్షించగలరో చూడాలి. వీరి ప్లాన్‌ను జియో ఏ విధంగా తిప్పికొడుతుందా అనే ఆసక్తి ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. ఏదేమైనా ఈ దెబ్బతో జియోపై యుద్ధం ప్రకటించిన మూడు కంపెనీల తెలివికి హ్యాట్సాఫ్ అంటున్నారు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్.

Related posts:
స్నాప్‌డీల్ మహిళా ఉద్యోగి కిడ్నాప్.. 40 గంటలు..
మెగాస్టార్ చే శభాష్ అనిపించుకున్న మన బర్నింగ్ స్టార్...ఎందుకో చూడండి!!
తనని కొట్టాడని.. హీరో సూర్యపై కేసు పెట్టిన ఫుల్‌బాల్ ప్లేయర్
సెల్ఫీ రాజాలకు షాక్.. రాణులపైనే ఎక్కువ ఎటాక్!
డబుల్ ఎంజాయ్‌మెంట్‌ అంటూ ప్రాణాలు పోగొట్టుకున్న డాక్టరమ్మ
విస్పర్ కోసం అమ్మాయిలు ఏం చేస్తున్నారో తెలిస్తే అంతే!!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.