క్యాస్టింగ్ కౌచ్ : దిక్కలేని చావుచచ్చిన టివి నటి

రంగుల ప్రపంచమైన సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ అనే చిమ్మచీకటి కూడా దాక్కుని వుంది. కొత్తగా వచ్చే భామలకు అది చూపించే నరకం అంతాఇంతా కాదు. దాన్నుంచి కొందరు ఎలాగోలా బయటపడితే.. ఇతరులు మాత్రం దారుణంగా బలైపోతున్నారు. ఒక్క ఛాన్స్ కోసం ఆ చిమ్మచీకటిలో అడుగుపెట్టి.. అట్నుంచే అటే కనుమరుగైపోతున్నారు. తాజాగా ఓ టివి నటి కూడా ఇందులో అడుగెట్టి.. దిక్కులేని చావు చచ్చింది. ఆఫర్ల పేరుతో తనని మభ్యపెట్టినా.. సినిమాల మీదున్న ప్రేమతో ఎందరికో కామవాంఛ తీర్చి.. చివరికి ఆ ఒక్క ఛాన్స్ దక్కకుండానే తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది.

సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిలిపోవాలనే ఉద్దేశంతో ఓ హైదరాబాద్ యువతి పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అవకాశాల కోసం ఎందరినో బతిమిలాండిది.. కాళ్ళావేళ్ళా పడింది. ఈ ప్రయాణంలో భాగంగా ఆమెకి సీరియళ్ళలో ఛాన్స్ వచ్చింది. అయితే.. సినిమాలో రాణించాలనే కోరికతో తన ప్రయత్నాలు కొనసాగించింది. ఈమె గురించి తెలుసుకున్న కామాంధులు.. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి ఆమె జీవితంతో కామాంధులు ఆడుకున్నారు. తమ లైంగిక వాంఛలు తీర్చుకొని ఆమెను మోసం చేశారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. తన ఒంటరితనానికి తోడుగా వుంటాడని అతడ్ని పెళ్ళి చేసుకుంది.

కానీ.. అతని ద్వారా ఆమెకి ప్రాణాంతక హెచ్‌ఐవీ సోకింది. పాప పుట్టాక.. కట్టుకున్నవాడు వదిలేసి వెళ్ళిపోయాడు. సినిమాల పేరుతో ఎందరో మోసం చేసిన బాధలో ఉన్న తనని భర్త వదిలేసి వెళ్ళిపోవడంతో మరింత కుంగిపోయింది. చివరికి.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆమె అర్ధాంతరంగా తనువు చాలించింది. అంత్యక్రియలు చేసేవారు లేక దిక్కులేని అనాథ శవమైంది. చివరకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెకు అంత్యక్రియలు నిర్వర్తించి తమ ఉదారతను చాటుకుంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.