‘టెంపర్’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. దద్దరిల్లిన బాలీవుడ్

Simmba First Look Poster Review
Tellmeboss.net

‘‘ఈడికేమైనా పిచ్చా.. ఎప్పుడో 2015లో వచ్చి వెళ్లిపోయిన ‘టెంపర్’ సినిమా ఫస్ట్‌లుక్ ఇప్పుడు రిలీజ్ అవ్వడం ఏంటి.. దానికి బాలీవుడ్ ఎందుకు దద్దరిల్లుతుంది?’’ అని అనుకుంటున్నారా! మీరిలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే.. ఇక్కడం మనం మాట్లాడుకుంటోంది తెలుగు ‘టెంపర్’ గురించి కాదు.. దాని హిందీ రీమేక్ గురించి!

Tellmeboss.net

పడిలేచిన కెరటంలా తారక్ స్టామినాని తెలుగు చిత్రపరిశ్రమకి చాటిచెప్పిన ‘టెంపర్’ చిత్రాన్ని హిందీలో ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితమే ఈ విషయాన్ని కన్ఫమ్ చేసిన ఈ డైరెక్టర్.. అప్పుడే ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసేశాడు. బాలీవుడ్ సెన్సేషన్ రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. రణ్‌వీర్ రియల్ లైఫ్‌లో చేసే చేష్టలకు తగ్గట్టే ఈ పోస్టర్‌ని కిర్రాక్‌గా డిజైన్ చేయడంతోపాటు.. నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు సైతం కిక్‌తో ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లరి పోలీస్ గెటప్‌లో రణ్‌వీర్ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడంటూ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

అంతేకాదండోయ్.. ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందంటూ పోస్టర్‌లోనే డోస్ పెంచి చెప్పేశారు. ‘సింబా’ అనే డిఫరెంట్ టైటిల్ పెట్టడంతోపాటు.. ‘సంగ్రామ్ భాలేరావ్’ అని హీరో పేరు రివీల్ చేస్తూ అతని క్యారెక్టర్ ఒక సైకోలాగా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. ఈ పోలీసోడు జనాల గుండెల్లో గోలీ గొట్టడం ఖాయంలా పోస్టర్‌తోనే అంచనాలు పెంచేశారు. మొత్తానికి.. తెలుగులో తారక్ చూపించినట్లుగానే రణ్‌వీర్ బాలీవుడ్‌లో తన ‘టెంపర్’ చూపించబోతున్నాడన్నమాట.

DQa4S74UEAA5eVf.jpg (900×1200)

Tellmeboss.net
Related posts:
12 రోజుల కలెక్షన్స్‌తో మరో రికార్డ్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్
రష్మీ మాట్లాడిన బూతు మాటలు.. మరో యాంగిల్ చూస్తారా?
ఆ విషయంలో ఎన్టీఆర్‌ని చూస్తే అసూయగా వుంటుందన్న శృతిహాసన్
‘శ్రీమంతుడు’ రికార్డులను బద్దలుకొట్టిన ‘సరైనోడు’
‘గ్యారేజ్’పై అనుకున్నదొకటి.. అయ్యిందొకటి
ఎన్టీఆర్‌కు కోటి కష్టాలు.. ఫ్యాన్స్ అండగా!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.