ఎనర్జిటిక్‌గా ఆ హీరోకోసం కొడతానంటున్న థమన్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో అనుపమ పరమేశ్వరన్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ‘తొలిప్రేమ’ లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించిన సంగీత దర్శకుడు థమన్.. ఈ సినిమాకి కూడా స్వరాలను అందిస్తున్నారు. గతంలో రామ్ హీరోగా నటించిన ‘కందిరీగ’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’లాంటి సినిమాలకి థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. హ్యాట్రిక్ సినిమాలతో అలరించిన ఈ కాంబో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారేమో చూడాలి.

కాగా.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.