‘తొలిప్రేమ’ 4 డేస్ కలెక్షన్స్.. 90% మార్జిన్‌తో రికార్డ్!

Tellmeboss.net

ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత హిట్ టాక్ తెచ్చుకున్నా.. తొలిరోజు రాబట్టినంతగా మిగతారోజుల్లో వసూళ్ళు పెద్దగా కలెక్ట్ చేయదు. రోజులు గడిచేకొద్దీ కొద్దొగొప్పో కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తాయి. అది వీకెండ్ అయినా, ఏ ఇతర హాలిడే వచ్చినా.. చెప్పుకోదగిన కలెక్షన్లు మాత్రమే కలెక్ట్ చేస్తుందే తప్ప గొప్పగా ఏం రాబట్టదు. కానీ.. ‘తొలిప్రేమ’ చిత్రం మాత్రం దాన్ని బ్రేక్ చేస్తూ సరికొత్త మార్జిన్‌లతో షేక్ చేస్తోంది.

తొలిరోజు మంచి వసూళ్లే కొల్లగొట్టిన ఈ మూవీ.. ఆ తర్వాత రోజుల్లోనూ పెద్దగా డ్రాప్ అవ్వకుండా స్టడీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. సరే.. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో డ్రాప్ అవ్వలేదనుకుందాం! సోమవారం వర్కింగ్ డే కాబట్టి ఖచ్చితంగా తగ్గాలి కానీ ఈ చిత్రం విషయంలో అలా జరగలేదు. రూ.2 కోట్ల దరిదాపుల్లోనే కలెక్ట్ చేసి, ‘తొలిప్రేమ’ షాకిచ్చింది. ఇక నాలుగరోజైనా శివరాత్రినాడు అదే మంగళవారం మరింత పుంజుకుని, ట్రేడ్ వర్గాల్నే షాక్‌లో ముంచెత్తింది ఈ చిత్రం.

Tellmeboss.net

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. నాలుగో రోజైన మంగళవారం ఈ మూవీ అక్షరాల రూ.2.66 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. ఓపెనింగ్ డేతో పోల్చుకుంటే దాదాపు 90% శాతం రాబట్టింది. దీంతో మొత్తం నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.10.5 కోట్ల షేర్ నమోదు చేయగలిగింది. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా బ్రహ్మాండమైన వసూళ్ళతో దూసుకుపోవడాన్ని చూస్తుంటే.. ఈ చిత్రం ఏ రేంజులో ఆడియెన్స్‌ని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.

ఏరియాలవారీగా 4 రోజుల కలెక్షన్స్ (కోట్లలో):
నైజాం : 4.10
ఉత్తరాంధ్ర : 1.53
సీడెడ్ : 1.25
గుంటూరు : 0.96
కృష్ణా : 0.90
ఈస్ట్ గోదావరి : 0.91
వెస్ట్ గోదావరి : 0.73
నెల్లూరు : 0.36
టోటల్ ఏపీ+తెలంగాణ షేర్ : రూ.10.74 కోట్లు

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.