‘తొలిప్రేమ’ 7 డేస్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. వరుణ్‌కి సెకండ్ హయ్యెస్ట్

ఈరోజుల్లో వర్కింగ్ డేస్‌లో కోటికిపైగా వసూళ్ళు రాబట్టడమంటే మామూలు విషయం కాదు. ప్రేక్షకుల మనసుల్ని విపరీతంగా గెలుచుకున్న సినిమాలే ఆ ఫీట్‌ని సాధించగలుగుతాయి. ‘తొలిప్రేమ’ చిత్రం కూడా అలాంటి కోవకి చెందిందేనని చెప్పుకోవచ్చు. రెండు రోజుల ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.10 కోట్ల మార్క్‌ని అందుకున్న ఈ మూవీ.. ఆ తర్వాత వర్కింగ్ డేస్‌లోనూ పెద్దగా డ్రాప్ అవ్వకుండా స్టడీ కలెక్షన్లతో రన్ అవుతూ వస్తోంది. బరిలో ఇతర చిత్రాలున్నప్పటికీ.. వాటికి ధీటుగా పోటీనిస్తూ వసూళ్ళ వర్షం కురిపించింది.

దీంతో.. ఏడు రోజుల రన్‌లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.18.18 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ని సాధించగలిగింది. వరుణ్ తేజ్‌కి ‘ఫిదా’ (రూ.23 కోట్లు) తర్వాత సెకండ్ హయ్యెస్ట్ ఫిగర్. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ మూటగట్టుకోవడంతో ఈ చిత్రానికి జనాలు బ్రహ్మరథం పట్టారు. అందుకే.. ఈ స్థాయి వసూళ్ళు రాబట్టిందని అంటున్నారు. అయితే.. రూ.22.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇంకా సేఫ్ జోన్‌లోకి ఎంట్రీ అవ్వాలంటే ఇంకా ఐదున్నర కోట్లు కలెక్ట్ చేయాల్సి వుంటుంది. ఈ చిత్రం దూకుడు చూస్తుంటే.. మంచి లాభాలే సాధిస్తుందని తెలుస్తోంది.

ఏరియాలవారీగా 7 రోజుల కలెక్షన్స్ (కోట్లలో):
నైజాం : 5.50
ఉత్తరాంధ్ర : 2.16
సీడెడ్ : 1.65
గుంటూరు : 1.14
ఈస్ట్ గోదావరి : 1.19
వెస్ట్ గోదావరి : 0.93
కృష్ణా : 1.08
నెల్లూరు : 0.43
ఏపీ+తెలంగాణ : రూ.14.08 కోట్లు
ఓవర్సీస్ : 2.80
రెస్టాఫ్ ఇండియా : 1.30
టోటల్ వరల్డ్‌వైడ్ (షేర్) : రూ.18.18 కోట్లు

Related posts:
ప‌వ‌న్‌కు కొత్త పీఏ వ‌చ్చాడు...అగ్నిప‌రీక్ష‌!
సంచలనం రేపుతున్న శింబు-స్టార్ హీరో కూతురి ‘బెడ్‌రూం’ వీడియో
‘జనతా గ్యారేజ్’లో టాప్ యాంకర్ సందడి.. కారణమిదే!!
టాలీవుడ్‌పై మరోసారి సెటైర్లు వేసిన బాలయ్య హీరోయిన్
మహేష్‌బాబు, శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్
‘స్పైడర్’ దెబ్బకు గోతిలో పడ్డ అఖిల్.. పాపం ‘హెలో’!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.