‘తొలిప్రేమ’ 9 రోజుల కలెక్షన్స్.. జస్ట్ 10 శాతమే!

బాక్సాఫీస్ వద్ద ‘తొలిప్రేమ’ చిత్రం నాన్-స్టాప్‌గా దూసుకెళుతోంది. బరిలో పోటీగా వున్న ఇతర చిత్రాల్ని పూర్తిగా డామినేట్ చేస్తూ.. సింగిల్‌గా దుమ్ముదులిపేస్తోంది. తొలిరోజు నుంచే అప్పర్ హ్యాండ్ సాధిస్తూ వచ్చిన ఈ చిత్రం.. సెకండ్ వీకెండ్‌లోనూ అదిరిపోయే వసూళ్ళు రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం రెండో వారాంతం(శని, ఆదివారాలు కలుపుకుని)లో రూ.2.50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్ట్ చేసింది. దీంతో.. మొత్తం 9 రోజుల్లో రూ.21 కోట్లు నమోదైంది.

వరల్డ్‌వైడ్‌గా చేసిన థియేట్రికల్ బిజినెస్ (రూ.22.50 కోట్లు)తో పోల్చుకుంటే.. ఇప్పటికే 90 శాతం ఈ చిత్రం రివకర్ చేసింది. ఇంకో 10 శాతం అదే కేవలం కోటిన్నర రాబడితే.. సేఫ్ జోన్‌లోకి చేరిపోయినట్టే లెక్క! మంచి పోటీలోనూ ఇలా కలెక్షన్ల వర్షం కురిపించడం నిజంగా విశేషం. ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకోవడం వల్లే ఈ చిత్రం ఇలా వసూళ్ళు కొల్లగొడుతోందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. టోటల్ రన్‌లోనూ ఈ మూవీ మంచి లాభాలు తెచ్చిపెడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఏరియాలవారీగా 9 రోజుల వసూళ్ళు క్రింది విధంగా వున్నాయి…

నైజాం : 6.28
ఉత్తరాంధ్ర : 2.56
సీడెడ్ : 1.86
ఈస్ట్ గోదావరి : 1.37
గుంటూరు : 1.30
కృష్ణా : 1.24
వెస్ట్ గోదావరి : 1.05
నెల్లూరు : 0.49
ఏపీ+తెలంగాణ : రూ.16.15 కోట్లు
ఓవర్సీస్ : 3.35
రెస్టాఫ్ ఇండియా : 1.50
టోటల్ వరల్డ్‌వైడ్ (షేర్) : రూ.21 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.