‘తొలిప్రేమ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. జస్ట్ మిస్!

మంచి అంచనాల మధ్య రిలీజయ్యే సినిమాల తొలిరోజు లెక్కలు ఎక్స్‌పెక్ట్ చేసినదానికంటే ఎక్కువగానే వస్తాయి. శుక్రవారం వర్కింగ్ డే అయినప్పటికీ అవి కలెక్షన్ల మోత మోగించేస్తాయి. అలాంటప్పుడు శనివారం విడుదలయ్యే చిత్రాలు మరింత ప్రభంజనం సృష్టించాలి. కానీ.. ‘తొలిప్రేమ’ మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయింది. మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. పాజిటిక్ టాక్ వచ్చినా.. ఈ మూవీ పెద్దగా కలెక్షన్ల సునామీ సృష్టించలేకపోయింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ.3.23 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రమే కొల్లగొట్టింది. ఇది వరుణ్ తేజ్ కెరీర్‌లో నాలుగో బిగ్గెస్ట్ ఓపెనింగ్. నిజానికి.. శనివారం రిలీజయ్యింది కాబట్టి ఈ చిత్రం భారీ కలెక్షన్లు కలెక్ట్ చేయాల్సింది. కానీ.. శుక్రవారం రిలీజైన వరుణ్ గత చిత్రాలకంటే ఇది వెనుకబడిపోయింది. వరుణ్ కెరీర్‌లో ‘ఫిదా’ చిత్రం రూ.3.43 కోట్ల వసూళ్ళతో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ చిత్రంగా తొలిస్థానం దక్కించుకోగా.. ‘లోఫర్ ’ రూ.3.42 కోట్లు, ‘ముకుంద’ రూ.3.39 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. శనివారం విడుదలైన ‘తొలిప్రేమ’ వాటన్నింటిని బీట్ చేస్తుందనుకుంటే.. రూ.3.23 కోట్లతో నాలుగో స్థానం సరిపెట్టుకుంది.

ఇక ఇతర ఏరియాల విషయానికొస్తే.. యూఎస్ఏలో రూ.1.44 కోట్లు, రెస్ట్ మొత్తం రూ.0.52 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన.. ఓవరాల్ వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ తొలిరోజు రూ.5.19 కోట్లు (షేర్) నమోదు చేసింది. ఈ మూవీకి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. ఫుల్ రన్‌లోపు పెట్టిన పెట్టుబడి(రూ.18 తెలుగు రాష్ట్రాల్లో)ని రికవర్ చేయడంతోపాటు మంచి లాభాలు కురుపిస్తుందని ట్రేడ్ నిపుణుల అంచనా.

ఏరియాలవారీగా ఫస్ట్ డే కలెక్షన్స్ : (కోట్లలో)
నైజాం : 1.20
సీడెడ్ : 0.35
ఉత్తరాంధ్ర : 0.45
గుంటూరు : 0.38
ఈస్ట్ గోదావరి : 0.24
వెస్ట్ గోదావరి : 0.25
కృష్ణా : 0.24
నెల్లూరు : 0.12
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ.3.23 కోట్లు
యూఎస్ఏ : 1.44
రెస్ట్ : 0.52
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ.5.19
టోటల్ గ్రాస్ : రూ.9.60 కోట్లు

Related posts:
అల్లరి నరేష్ సినిమా చూసి అభిమాని మృతి
‘బాహుబలి-2’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. దేశ సినీ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డ్
‘జయ జానకి నాయక’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్
రంగుల రాట్నం మూడు రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ముక్కుతూ ములుగుతూ మూడు దాటింది!
‘స్కెచ్’ క్లోజింగ్ కలెక్షన్స్.. ఘోరమైన ఫ్లాప్
ట్రైలర్ టాక్: యుద్ధంలో పద్యం పాడొద్దంటున్న కృష్ణార్జునులు

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.