ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన త్రిష..

Trisha Krishnan Clarity On Kollywood Movie Offers Rumours

కొన్నాళ్ళ క్రితం అవకాశాలు లేక గాడిలో పడిన చెన్నైబ్యూటీ త్రిష కెరీర్ ఈమధ్యే ఊపందుకుంది. తెలుగులో అంతగా ఆఫర్లు రావడం లేదుగానీ.. తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడికి రెండు భారీ సినిమాల్లో రెండో కథానాయికగా నటించే ఆఫర్స్ దక్కాయని, వాటికి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని ఓ ప్రచారం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని త్రిష తేల్చి చెప్పేసింది.

త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమా అన్ని కార్యక్రమాలను ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ధనుష్ జోడీగా ఆమె నటించిన ‘కోడి’ సినిమా కూడా చివరి దశకి చేరుకుంది. ఈ సినిమాల అనంతరం ఆమె మరో రెండు మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. విజయ్ సేతుపతి తాజా చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందనీ, నయనతార ఒక కథానాయిక కాగా మరో కథానాయికగా త్రిష కనిపించనుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ మూవీతోపాటు అజిత్ 57వ సినిమాలోనూ అనుష్కతో త్రిష కలిసి కనిపించనుందని చెప్పుకుంటున్నారు. అయితే.. ఈ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని తాజాగా త్రిష స్పష్టం చేసింది.

విజయ్ సేతుపతి, అజిత్ సినిమాలలో తాను రెండో కథానాయికగా నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఆ రెండు సినిమాల కోసం తనని ఎవరూ సంప్రదించలేదనీ, తాను ఈ సినిమాలు చేయడం లేదని త్రిష చెప్పింది. ఆ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఒకవేళ తాను ఏదైనా సినిమాని అంగీకరిస్తే.. స్వయంగా తానే వెల్లడిస్తానని త్రిష చెప్పుకొచ్చింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.