తమిళ సూపర్‌స్టార్‌తో త్రివిక్రమ్.. ఇది అరాచకానికి అమ్మమొగుడు

trivikram suriya bilingual project

ఈమధ్య స్టార్ దర్శకులు ఓ మీడియం హీరోతో సినిమాలు తీసి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. కలెక్షన్ల ఫిగర్ కూడా ఆకాశాన్నంటుతోంది. ఇటు నిర్మాతలకే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్‌కి లాభాల వర్షం కురుస్తోంది. మరి అలాంటి డైరెక్టర్స్‌కి మరో స్టార్ ఇమేజ్ తోడైతే..? బాక్సాఫీస్‌కి చుక్కలు కనిపించాల్సిందే. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నో కాంబోలో నిరూపించాయి. తాజాగా మరో జంట ఇండస్ట్రీలో కొత్త సంచలనానికి తెరతీసేందుకు రెడీ అవుతోంది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ సూపర్‌స్టార్ సూర్యతో ఓ బైలింగ్వల్ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్ పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ కథ ప్రత్యేకంగా సూర్య కోసమే రాస్తున్నాడట. అన్ని అనుకున్నట్లు సవ్యంగా జరిగితే.. ఎన్టీఆర్‌తో మూవీ చేసిన సూర్యతో సెట్స్ మీదకి వెళ్ళాలని ప్లాన్. అంటే.. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఆల్రెడీ అంతర్గతంగా చర్చలు జరిగిపోయాయని అంటున్నారు.

త్రివిక్రమ్‌కి తెలుగులో ఓ బ్రాండ్ ఇమేజ్ వుంది.. సూర్యకి తమిళంతో సమానంతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వుంది. అలాంటి వీరి కాంబోలో సినిమా అంటే.. రెండు ఇండస్ట్రీల్లోనూ క్రేజీగా అంచనాలు నెలకొనడం ఖాయం. ఇక బాక్సాఫీస్‌కి అయితే చుక్కలు కనిపించక తప్పదు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.