ఉంగరాల రాంబాబు రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

సినిమా : ఉంగరాల రాంబాబు
దర్శకుడు : క్రాంతి మాధవ్
నిర్మాత : పరుచూరి కిరీటి
మ్యూజిక్ : గిబ్రన్
నటీనటులు : సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని తదితరులు

కమెడియన్‌ నుండి హీరోగా మారిన సునీల్ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే హీరోగా మారిన కొంత కాలం వరుస హిట్‌లు అందుకున్న సునీల్ ఆ తరువాత అదే రేంజ్‌లో విజయాలు సాధించడంలో విఫలమయ్యాడు. ఇక తాజాగా సునీల్ ఉంగరాల రాంబాబు అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అతడు ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సి ఉంది. మరి ఈ సినిమా సునీల్‌ కోరుకునే హిట్ ఇచ్చిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
రాంబాబు(సునీల్) చాలా ఆస్తిగలవాడు. తన తాతయ్య మరణించిన తరువాత అతడు ఆ ఆస్తిని మొత్తం కోల్పోతాడు. చివరికి చిల్లి గవ్వ కూడా మిగలదు. ఈ క్రమంలో అతడు బాదం బాబా(పోసాని)ని కలుస్తాడు. బాబా చెప్పినట్లుగానే అతడు మళ్లీ కోటీశ్వరుడు అవుతాడు. కొంతకాలంలోనే మళ్లీ అతడి బిజినెస్‌లో నష్టాలు వస్తుండటంతో బాదం బాబా సలహా మేరకు సావిత్రి(మియా జార్జ్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. సావిత్రి కూడా రాంబాబుని ఇష్టపడుతుంది. అయితే ఆమె తన తండ్రి ఒప్పుకుంటేనే రాంబాబుని పెళ్లి చేసకుంటానని చెప్పడంతో అతడు సావిత్రితో ఆమె ఊరికి వెళతాడు. అక్కడ సావిత్రి నాన్న(ప్రకాష్ రాజ్) వల్ల అనుకోని చిక్కుల్లో పడతాడు. ఇంతకా ఆ చిక్కులు ఏమిటి? సావిత్రి నాన్న ఏం చేస్తుంటాడు? రాంబాబు తన ప్రేమను గెలుస్తాడా లేదా? అనేది మిగతా స్టోరి.

విశ్లేషణ:
ఉంగరాల రాంబాబు.. టైటిల్ వినగనే మనకు చలం నటించిన పాత సినిమా ‘‘సంబరాల రాంబాబు’’ గుర్తుకు వచ్చేస్తుంది. కానీ దీనికి ఆ సినిమాతో ఏమాత్రం పోలిక ఉండదు. ఉంగరాల రాంబాబు సినిమా స్టోరీ రొటీన్ కమర్షియల్ అయినప్పటికీ కామెడీతో ఆడియెన్స్‌ను మెప్పించేస్తుంది. ఈ సినిమా ఫస్ట్‌హాఫ్‌లో సునీల్ ఓ ధనవంతుడిగా కనిపిస్తాడు. అతడు తన ఆస్తిని కాపాడుకునేందుకు బాదం బాబాను నమ్మడం కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది. అయితే తనకు బాగా కలిసివచ్చే జాతకం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసకునేందుకు సునీల్ పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. తన ఆఫీసులోనే ఆమెకు ఉద్యోగం ఇవ్వడంతో మొదలయ్యి ఆమెను ఇంప్రెస్ చేసే ప్రతీ సీన్ కామెడీని పండించింది. ఈ క్రమంలోనే హీరోయిన్ చెప్పే ఓ చిన్నపాటి ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా కాస్త ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. ఇక ఇందులో సునీల్ ఇంట్రోడక్షన్, హీరో-హీరోయిన్ రొమాన్స్ వంటి ఎపిసోడ్స్ బాగున్నాయి.

సెకండాఫ్‌లో సునీల్ తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరోయిన్‌తో కలిసి ఆమె ఊరికి వెళతాడు. ఆమె తండ్రి కమ్యూనిసమ్ భావాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి కావడంతో అతడి చేష్టలకు సునీల్ కొన్ని చిక్కుల్లో పడతాడు. ఇక వాటి నుండి సునీల్ బయటపడి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడన్నదే సెకండాఫ్‌లో మనకు కనిపిస్తోంది. ఇలా సెకండాఫ్‌లో ఆకట్టుకునే అంశాలు ఏమీ లేకపోవడంతో ఆడియెన్స్‌కు సినిమాపై విరక్తి వచ్చేస్తుంది. ఇక సునీల్ కామెడీ కూడా ఈ సినిమాకు ఏమాత్రం హెల్ప్ కాలేదు. యాక్టింగ్ పరంగా సునీల్ ఓకే అనిపించేస్తాడు. దర్శకుడు క్రాంతి మాధవ్ మాత్రం ఇలాంటి సినిమాకు ఎంచుకున్న కథ-కథనం పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. మొత్తానికి ఉంగరాల రాంబాబు సునీల్ కెరీర్‌లో మరో ఫ్లాప్ సినిమాగా మిగిలిపోతోంది.

నటీనటులు:
కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్, మొదట్లో చేసిన కొన్ని సినిమాలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే కామెడీ వదిలేసిన సునీల్‌ను విజయాలు కూడా వదిలేశాయి. దీంతో మనోడు ఏ సినిమా చేసినా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. ఉంగరాల రాంబాబులో మాత్రం హీరోయిజాన్ని పక్కన పెట్టాడు సునీల్. కానీ ఈ సారి కూడా విజయం అతడిని వరించలేదు. రొటీన్ యాక్టింగ్‌తో సదరు ప్రేక్షకుడికి విరక్తి తెప్పించేస్తాడు సునీల్. కేవలం డ్యాన్సుల కోసమే సినిమా చూడటానికి జనాలు రారు అనే విషయాన్ని మనోడు ఇక తెలుసుకోవాలి. హీరోయిన్ మియా జార్జ్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు. సినిమాలో ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి అమ్మడు ఉంది. ఇక ఆమె తండ్రిగా ప్రకాష్ రాజ్ మాత్రమే ఈ సినిమా కోసం కష్టపడినట్లు కనిపిస్తాడు. మిగతావారు ఉన్నారంటే ఉన్నారు.

సాంకేతిక విభాగం:
ఉంగరాల రాంబాబు విషయంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే దర్శకుడు క్రాంతి మాధవ్. రెండు ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఇలాంటి సినిమా చేశాడంటే ఎవ్వరూ నమ్మరు. కానీ ఇదే నిజం. క్రాంతి మాధవ్ ఈ సినిమాతో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అతడి గత సినిమాలతో ఈ సినిమా మచ్చుక్కైనా ఎక్కడా పోలీకుండదు. సినిమాటోగ్రఫి పర్వాలేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. ఈ సినిమాకు గిబ్రన్ మ్యూజిక్ అందించాడంటే నమ్మడానికి కాస్త టైమ్ పడుతుంది. తెలుగులో అతడు ఇచ్చిన హిట్ సాంగ్స్‌కి ఈ సినిమా పాటలకి ఎక్కడా పోలికుండదు.

చివరిగా:
ఉంగరాల రాంబాబు – మాకేంటిది.. బాబు!

నేటిసినిమా రేటింగ్: 2.25/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.