వరుణ్, రాశిఖన్నాల ‘తొలిప్రేమ’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : తొలిప్రేమ
నటీనటులు : వరుణ్‌తేజ్‌, రాశీఖన్నా, సప్న పబ్బి, ప్రియదర్శి, హైపర్‌ ఆది, తదితరులు
సంగీతం : తమన్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాత : బి.వి.ఎన్‌.ఎస్‌. ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ : జార్జ్‌ సి.విలియమ్స్‌
ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి
బ్యానర్‌ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేదీ : 10-02-2018

డిఫరెంట్ సినిమాలు చేస్తున్న యువహీరోల్లో ఒకడైన వరుణ్ తేజ్ లేటెస్ట్‌గా చేసిన మూవీ ‘తొలిప్రేమ’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రాశీఖన్నా కథానాయికగా నటించింది. డిఫరెంట్ ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం మంచి అంచనాల్నే మూటగట్టుకుంది. మరి.. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి..

కథ :
ఆదిత్య (వరుణ్ తేజ్) రైల్వే స్టేషన్‌లో కనిపించిన వర్ష(రాశిఖన్నా)ని చూసి.. తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అనుకోకుండా ఆ ఇద్దరూ ఒకే కాలేజ్‌లో చేరుతారు. ఇక అక్కడినుంచి ఇద్దరి ప్రేమకథ మొదలవుతుంది. వరుణ్ ప్రేమించమని వెంటపడితే.. చివరికి ఆమె కూడా అతని ప్రేమలో పడిపోతుంది. ఇలా సాఫీగా సాగుతున్న సమయంలో.. ఓ రోజు ఇద్దరూ గొడవపడతారు. దానివల్ల వాళ్ళు విడిపోతారు. కట్ చేస్తే.. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఇద్దరూ కలుసుకుంటారు. అలా అనుకోకుండా మళ్ళీ కలిసిన ఆ ఇద్దరూ ఎలా దగ్గరవుతారన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :
టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ స్టోరీస్ వచ్చి చాలాకాలమే అయ్యింది. కొన్ని ప్రేమకథలు వచ్చినప్పటికీ.. ప్రేక్షకుల్ని లోతుగా టచ్ చేసిన మూవీలైతే రాలేదు. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత అంతలా స్పందింపజేసే సినిమానే ‘తొలిప్రేమ’. ఈమధ్య కాలంలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ఇదొకటని చెప్పుకోవచ్చు. అలాగని ఇందులో లోపాలు లేవని కావు కానీ.. ఓవరాల్‌గా మాత్రం మంచి అనుభూతి కలిగించే పీల్ గుడ్ లవ్ స్టోరీ. కథ కూడా కొత్తదేమీ కాదు. ఇద్దరు ప్రేమికులు విడిపోయి.. మళ్ళీ కలుసుకోవడమే కథ. ఇలాంటి స్టోరీస్ ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి కానీ.. దీని ప్రత్యేకత దీనికుంది. ప్రేక్షకుల్లో ఒక ఫీల్ తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఫస్టాఫ్ గురించి మాట్లాడితే.. ఇందులో ప్రతీది చాలా ఆసక్తికరంగా వున్నాయి. హీరో-హీరోయిన్ల ఫ్రెష్ లవ్ ట్రాక్, సరదాగా సాగిపోయే సీన్లు, ఆలోచింప చేసే డైలాగ్స్, ఆహ్లాదపరిచే సంగీతం, కడుపుబ్బా నవ్వుకునే కామెడీ.. ఇవన్నీ ప్రథమార్థాన్ని టాప్ లెవెల్‌కి తీసుకెళ్ళాయి. ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టిపడేస్తూ ఫస్టాఫ్ చాలా బాగా సాగుతుంది. ముఖ్యంగా.. కాలేజీ నేపథ్యంలో వచ్చే సీన్లు యువతను కట్టిపడేస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. ప్రథమార్థం చూశాక ద్వితీయార్థం మరెంత బాగుంటుందో అనుకుంటే.. రొటీన్ బాటపట్టి ఇంతేనా? అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య అపార్థాలు పెరగడం, చివరికి అవి తొలగిపోయి ఒక్కటవ్వడం.. అంతా రొటీనే.

ఈ ట్రాక్‌ని కాస్త డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసి వుంటే కొత్తదనం వుండేదేమో! అలాగని ఇందులో బోర్ కొట్టించే సీన్లైతే లేవు. ఒక మోస్తరు బాగానే సాగుతుంది. కానీ.. రొటీన్‌గా వుండటమే తేడా కొట్టేసింది. ఇక మంచి ఫీల్‌తో క్లైమాక్స్ ముగుస్తుంది. అక్కడ ప్రేక్షకుల్ని స్పందింపచేయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ఓవరాల్‌గా.. ఇందులోని లోపాల్ని పక్కనపెడితే, ప్రత్యేక అనుభూతి కలిగించే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఈ సినిమా.

నటీనటుల ప్రతిభ :
లవర్‌బాయ్‌గా వరుణ్ తేజ్ చాలా బాగా నటించాడు. కోపం-ప్రేమ కలగలిపిన యువకుడిగా చాలా సహజంగా నటించి, మెప్పించాడు. ఒక విధంగా.. అతని కెరీర్‌లో ఇది ది బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా చెప్పుకోవచ్చు. రాశీఖన్నా కూడా వరుణ్‌కి పోటీగా చాలా బాగా యాక్ట్ చేసింది. తన కెరీర్‌లోనే బెస్ట్‌ అనుకునేలా ఆమె మెప్పించింది. వర్ష పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసింది రాశీఖన్నా. హైపర్‌ ఆది, ప్రియదర్శి, నరేశ్‌ నవ్విస్తారు. సుహాసినికి ఓ మంచి పాత్ర దక్కింది. మిగతా నటీనటులు మామూలే.

సాంకేతిక పనితీరు :
జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మూడ్‌కి తగ్గ కెమెరా పనితనంతో ప్రేక్షకుల్ని ఫీల్ చేయగలిగాడు. తమన్ సంగీతం ఈ మూవీకి మరో మేజర్ ఎసెట్. అద్భుతమైన ఔట్‌పుట్‌తో మంచి పాటలు అందించాడు. నేపథ్య సంగీతం కూడా అదిరింది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి గురించి మాట్లాడితే.. తొలిచిత్రంతోనే ప్రామిసింగ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టు ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఫ్రెష్‌గా ప్రెజెంట్ చేసి.. తనదైన ముద్ర చూపించాడు. కాకపోతే.. సెకండాఫ్‌పై కొంచెం కసరత్తు చేస్తే బాగుండేది.

చివరగా : మనసుల్ని కట్టిపడేసే ఫీల్ గుడ్ ప్రేమకథ
రేటింగ్ : 3.25/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.