రెండు రోజులకే సగం కొల్లగొట్టేసిన ‘తొలిప్రేమ’

వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం ఆడియెన్స్ హృదయాల్ని గెలుచుకోవడంలో పూర్తిగా సక్సెస్ కావడంతో.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం మామూలుగా కురవట్లేదు. ఊహించనిదానికంటే కలెక్షన్ల మోత మోగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రీమియర్స్ ద్వారా తక్కువే వసూళ్ళే రాబట్టినా.. విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో శుక్ర, శనివారాల్లో ఓ కుదుపు కుదిపేసింది. దీంతో.. రెండు రోజుల్లోనే ఈ చిత్రం అక్కడ హాఫ్ మిలియన్ మార్క్‌ని దాటేసింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. గురువారం ప్రీమియర్స్‌ ద్వారా ఈ చిత్రం $152,171 కలెక్ట్ చేసింది. ఆ తర్వాతి రోజైనా శుక్రవారం పెద్దగా పుంజుకోలేకపోయింది. దీంతో.. ప్రీమియర్స్‌తో కలుపుకుని తొలిరోజుకి $294K నమోదైంది. అయితే.. శనివారం మాత్రం ఈ చిత్రం దుమ్ముదులిపేసింది. ఏకంగా $210K కొల్లగొట్టింది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం $504K నమోదు చేయగలిగింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించడం నిజంగా విశేషం. దీంతో.. ముచ్చటగా మూడోసారి వరుణ్ తేజ్ హాఫ్ మిలియన్ మార్క్‌ని అందుకున్నాడు.

ఇదే దూకుడు కొనసాగిస్తే.. ఇది ఖచ్చితంగా 2 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరే అవకాశం వుందని ట్రేడ్ నిపుణుల అంచనా. వరుణ్ ఇప్పటికే ‘ఫిదా’ చిత్రంతో $ 2M ఫీట్‌ని అందుకున్నాడు. ‘తొలిప్రేమ’తోనూ ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.