అదిరిపోయే టైటిల్‌ను మిస్ చేసుకున్న వెంకీ!

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గురు లాంటి సక్సెస్‌ఫుల్ సినిమా తరువాత వెంకీ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వెరైటీ కథలతో అలరించే వెంకీ ఈసారి ఎలాంటి సినిమాతో మనముందుకు వస్తున్నాడా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాకు ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ అయ్యిందంటూ గతంలో వార్తలు వినిపించాయి.

తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘‘ఈ నగరానికి ఏమైంది’’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు బలంగా వనిపించాయి. అందుకు కారణం సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ టైటిల్‌ను రిజిష్టర్ చేయించుకోవడమే. అయితే ఇప్పుడు ఈ టైటిల్ వెంకీ మిస్ అయ్యాడని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్‌ రిజిష్టర్ చేయించుకున్న ఈ టైటిల్‌ను ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు అప్పచెప్పారు. పెళ్లిచూపులు తరువాత తరుణ్ భాస్కర్‌తో సినిమా చేసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కోసం వెంకటేష్ టైటిల్‌ను త్యాగం చేశారు సురేష్ ప్రొడక్షన్స్ వారు. ఇక తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో విశ్వాక్ సేన్, అనీషా ఆంబ్రోస్ హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

మరోవైపు వెంకటేష్ తేజ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. మరి వెంకటేష్ మిస్ చేసుకున్న టైటిల్ ప్లేస్‌లో ఏ టైటిల్ వస్తుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.