పవన్ తిక్కకు లెక్కలు తేల్చనున్న వెంకీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అజ్ఞాతవాసి’ జనవరి 10న బ్రహ్మాండంగా రిలీజ్ అయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వం, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో ఒకరేంజులో చెప్పడంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా రిలీజ్ తరువాత మాత్రం రిజల్ట్ మారిపోయింది. కథలో ఏమాత్రం బలం లేకపోవడంతో ఈ సినిమాను పవన్ ఫ్యాన్స్ తిప్పికొట్టారు. అయితే ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్‌తో పాటు వెంకటేష్ ఫ్యాన్స్‌ కూడా చాలా ఆతృతగా ఎదురుచూశారు.

ఈ సినిమాలో వెంకీ ఓ కేమియో పాత్రలో కనిపిస్తారని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెప్పడంతో సినిమాలో ఎక్కడ వెంకీ ఎంట్రీ ఇస్తాడా అని వెయిట్ చేశారు ఫ్యాన్స్. అయితే చిత్ర నిడివి ఎక్కువయ్యిందని వెంకటేష్ ఉన్న సీన్స్‌ను ఎడిటింగ్‌లో తీసేశారని వార్తలు వినిపించాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం వేరే ప్లాన్‌లో ఉన్నారని తెలిసింది. వారు ఈ సీన్స్‌ను రిలీజ్ తరువాత సంక్రాంతి కానుకగా యాడ్ చేద్దామని అనుకున్నారు. ఇందుకు సంబంధించి వారు తాజాగా ప్రకటన కూడా చేశారు. మొత్తానికి సంక్రాంతి నాడు పవన్‌ తిక్కకు వెంకటేష్ లెక్కలు వేయడానికి అజ్ఞాతవాసిలో మనకు దర్శనమిస్తాడు. దీనికి సంబంధించిన మేకింగ్ ప్రోమో వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ విషయం తెలుసుకున్న పవన్ అండ్ వెంకీ ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పవన్ చిత్రానికి వెంకటేష్ తోడవడంతో అజ్ఞాతవాసి కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.