26కి 72.. తేల్చేసిన లెక్కల మాష్టారు!

ఫ్యామిలీ చిత్రాల హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం దర్శకుడు తేజ డైరెక్షన్‌లో ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. గతకొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త వస్తుండటంతో ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు జనాలు. అయితే తాజాగా ఈ సినిమా లాంఛ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.

వెంకటేష్ కెరీర్‌లో 72వ చిత్రంగా రానున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో వెంకీ ఒక ప్రొఫెసర్‌గా మనకు దర్శనిమిస్తాడు. ఈ సినిమాలో హీరోయిన్ శ్రియా నటించనుంది. యాదృచికంగా ఈ సినిమా శ్రియాకు కూడా 72వది కావడం విశేషం. ఇక ఈ సినిమాను మార్చి 26న అఫీషియల్‌గా లాంఛ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఎలాంటి బ్రేకులు లేకుండా చిత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాక ‘‘ఆట నాదే వేట నాదే’’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

కాగా ఈ సినిమాలో వెంకటేష్, శ్రియాలతో పాటు యంగ్ హీరో నారా రోహిత్, అందాల భామ ఇషా రెబ్బాలు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాను సురేష్ బాబు, అనిల్ సుంకర్ సంయుక్తంగా నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో సైతం మంచి అంచనాలు నెలకొన్నాయి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.