బాలయ్యతో దేనికైనా రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ‘ఎన్టీఆర్’ పేరుతో తెరకెక్కనున్న ఈ బయోపిక్ కోసం బాలయ్య ఇప్పటికే పక్కా ప్రణాళికను రూపొందించుకున్నాడు. దర్శకుడు తేజ డైరెక్షన్‌లో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌పై రూపొందించేందుకు బాలయ్య రెడీ అయ్యాడు. ఈ సినిమాలోని నటీనటుల గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.

ఎన్టీఆర్‌గా బాలయ్య మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం ఏకంగా 62 గెటప్స్‌లో మనకు బాలయ్య కనిపిస్తాడు. ఇక ఈ సినిమాలో నందమూరి తారక రామారావు సతీమణి బసవతారకం పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్‌ను సంప్రదించారట చిత్ర దర్శకుడు తేజ. బాలయ్య నటిస్తు్న్న సినిమా కావడం, ఎన్టీఆర్ బయోపిక్ గురించి తెలుసుకున్న ఆమె వెంటనే ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుందట. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఏదేమైనా బాలయ్య ఈ సినిమా కోసం ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.